DELHI COLLEGE GOVERNING BODY MEET HELD _ ఢిల్లీ ఎస్వీ కళాశాల గవర్నింగ్‌బాడీ ఛైర్మన్‌గా శ్రీ వైవి.సుబ్బారెడ్డి
Tirupati, 13 May 20: The Chairman of TTD Trust Board Sri YV Subba Reddy has been elected as the Chairman of the Governing Body of Sri Venkateswara College at New Delhi while the FACAO of TTD Sri Balaji as Treasurer.
A review meeting of the Governing Body through a Video Conference on the proceedings of the College was held on Wednesday by the Chairman from his residence at Tadepalle.
The meeting has decided to appoint the Principal of the college as per the norms of Delhi University as the present Principal Dr.P Hemalatha Reddy is retiring in May 31.
Dr Padma Suresh has been appointed as the In-charge Principal while Associate Professor Dr Venkat Kumar as Vice-Principal. The meeting also decided to take up recruitment of Teaching and non-Teaching staffs in the College as per the guidelines of Delhi University.
TTD EO Sri Anil Kumar Singhal, Board Members and Governing Body Members of Delhi College Dr Sudha Narayana Murthy, Smt Vemireddy Prasanthi Reddy, Dr Nischita, Sri Parthasaradhi Reddy, Sri DP Ananta, Representatives of Teaching and Non Teaching also took part in the conference.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఢిల్లీ ఎస్వీ కళాశాల గవర్నింగ్‌బాడీ ఛైర్మన్‌గా శ్రీ వైవి.సుబ్బారెడ్డి
సిబ్బంది నియామకాల ప్రక్రియకు అనుమతి
తాడేపల్లి, 2020, మే 13: ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల గవర్నింగ్‌బాడీ ఛైర్మన్‌గా తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజిని ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని ఛైర్మన్ నివాసం నుంచి బుధవారం ఢిల్లీ ఎస్వీ కళాశాల గవర్నింగ్‌బాడీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.హేమలతారెడ్డి మే 31న ఉద్యోగ విరమణ చేయనుండడంతో ఆమె స్థానంలో అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఎం.పద్మాసురేష్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఢిల్లీ యూనివర్సిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా నూతన ప్రిన్సిపాల్ నియామకం చేపట్టాలని నిర్ణయించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డా.వెంకట్‌కుమార్‌ను వైస్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఢిల్లీ యూనివర్సిటీ నియమనిబంధనలకు అనుగుణంగా కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించడానికి గవర్నింగ్‌బాడీ అనుమతి మంజూరు చేసింది.
ఈ కాన్ఫరెన్స్‌లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ,టిటిడి బోర్డు సభ్యులు, కళాశాల గవర్నింగ్‌బాడీ సభ్యులు డా. సుధా నారాయణమూర్తి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డా. ఎం.నిశ్చిత, శ్రీ డిపి.అనంత, డా. బి.పార్థసారథిరెడ్డి పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.