TTD CHAIRMAN LAUDS CONSTABLE ARSHAD _ నీ సేవ అభినందనీయం – కానిస్టేబుల్ ఆర్షద్ ను ఫోన్ లో అభినందించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirupati, 27 Dec. 20: TTD Chairman Sri YV Subba Reddy on Sunday lauded the Police constable Sri Arshad of YSR Kadapa Special Branch for his humanitarian act of carrying a 60 year old devotee Smt Nageswaramma of Nandamuri for six kilometers on his shoulders up to Tirumala.

The constable was member of the special security team of former MLA Sri A Amarnath Reddy who came to Tirumala on Padayatra on December 23 through the Annamaiah Margam amidst dense Seshachala forests.

The local media carried reports about the cop’s humanitarian gesture of carrying an aged Lady who fell sick on the forest track.

TTD Chairman personally called the Constable Arshad and appreciated his services and indicated that he would refer it to DGP of AP for suitable rewards. .

In a humble manner the constable responded that whatever he did was due to stamina and strength given by Lord Venkateshwara.

BETTER HEALTH SERVICES ON FOOTPATHS:

In the backdrop of two incidents of sick devotees on footpaths, TTD Chairman directed officials to make arrangements for emergency medical facilities on footpaths like medicines, ambulance, oxygen etc.

It may be recalled that two days ago AP GENCO MD Sri Sridhar had also fallen sick on Alipiri footpath and was rescued on a war footing.

Addressing a meeting of senior officials at Sri Padmavati Rest House on Sunday, the TTD Chairman reviewed on PHCs, Staff, and Medicines etc. available on footpaths. He directed officials to organise ambulances and also wireless sets at the centres for providing fast services to devotees.

TTD JEO Sri P Basanth Kumar, Chief Medical Officer Dr Narmada and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

నీ సేవ అభినందనీయం
 
 –  కానిస్టేబుల్ ఆర్షద్ ను ఫోన్ లో అభినందించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
 
–   వేంకటేశ్వర స్వామే నాకు ఆ శక్తి ఇచ్చాడు అన్న ఆర్షద్
 
తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 27: ” 60 సంవత్సరాల మహిళను ఆరు కిలోమీటర్ల దూరం అడవి గుండా తిరుమలకు మోసుకొచ్చావు. భక్తురాలికి నీవు చేసిన సేవ అభినందనీయం. నీ సేవలను గుర్తించాలని డిజిపి కి చెబుతాను” అని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కడప స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ శ్రీ ఆర్షద్ ను అభినందించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారే నాకు ఆ శక్తి ఇచ్చారని కానిస్టేబుల్ సమాధానం ఇచ్చారు.
 
రాజంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటి అమరనాథ రెడ్డి ఆకేపాడు నుంచి తిరుమలకు అన్నమయ్య మార్గంలో ఇటీవల మహా పాదయాత్ర జరిపిన విషయం తెలిసిందే.
 
పాదయాత్రలో పాల్గొన్న నందలూరుకు చెందిన 60 ఏళ్ల నాగేశ్వరమ్మ  ఈ నెల 23వ తేదీ అటవీప్రాంతంలో  అస్వస్థతకు గురై సొమ్మ సిల్లి పోయారు. పాదయాత్ర భద్రత డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆర్షద్ ఆమెను తన భుజాల మీద వేసుకుని 6 కిలోమీటర్ల దూరం తిరుమలకు మోసుకొచ్చి అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు.
 
      ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వెలువడింది. వివరాలు తెలుసుకున్న టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కానిస్టేబుల్ వివరాలు, సెల్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి అభినందించారు. మీ లాంటి వారి సేవలు ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని చెప్పారు. 
 
నడక దారుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచండి  :  అధికారులకు టీటీడీ చైర్మన్ ఆదేశం
 
తిరుమలకు వెళ్ళే నడక దారుల్లో భక్తులకు అత్యవసర వైద్య సేవలు మెరుగు పరచాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. జెన్కో ఎండి శ్రీ శ్రీధర్ నడక దారిలో గుండెపోటు వచ్చి స్విమ్స్ లో చేరడం, అన్నమయ్య మార్గంలో నాగేశ్వరమ్మ అస్వస్థతకు గురై కానిస్టేబుల్ తిరుమలకు మూసుకుని వచ్చిన సంఘటనల నేపథ్యంలో తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.
 
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారుల్లో ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాలు, అందులో ఉన్న సిబ్బంది, అందుబాటులో ఉన్న మందులు ఇతర విషయాల గురించి వివరాలు తెలుసుకున్నారు. నడక దారిలో అస్వస్థతకు గురైన భక్తులకు అత్యవసరంగా వైద్యం అవసరమైతే ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వివరాలు వెంటనే సంబంధింత ఆసుపత్రికి అందించడానికి వైర్లెస్ సెట్లు కూడా ఏర్పాటు చేయాలని చైర్మన్ ఆదేశించారు. జెఈవో శ్రీ బసంత్ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.