SRIVARI PRANAYOTSAVAM ON DECEMBER 30 _ డిసెంబరు 30న శ్రీవారి ప్రణయకలహోత్సవం

POURNAMI GARUDA SEVA CANCELLED

Tirumala, 27 Dec. 20: TTD is organising the unique festival of Pranaya Kalahotsavam, a festival of love and joy of deities, on December 30 at Tirumala.

As part of this festival, the utsava idols of Sri Malayappa and His consorts are brought out in separate palanquins face to face from Vaibhavotsava Mandapam opposite to Sri Varaha Swami temple.

The Archakas enact a love game and divide into two, with a team representing Lord and another, both the Goddesses.

They chant hymns in Nindastuti pattern with Consorts making fun of the mischievous deeds of Lord Sri Malayappa and indulge in a fight with Him.

Thereafter they throw flower balls at each other, re-enacting a mythological love quarrel as depicted in legends tagged as Pranaya- kalaha – Mahotsavam.

In view of this festival, TTD has cancelled Pournami Garuda Seva on the same day evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

డిసెంబరు 30న శ్రీవారి ప్రణయకలహోత్సవం
 
పౌర్ణమి గరుడసేవ రద్దు
 
తిరుమల, 2020 డిసెంబ‌రు 27: శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం డిసెంబ‌రు 30వ తేదీ బుధ‌వారం తిరుమలలో జరుగనుంది.
 
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.
 
ఈ ఉత్సవం కారణంగా బుధవారం పౌర్ణమి సందర్భంగా జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.