SPOT ADMISSIONS TO TTD JUNIOR COLLEGES ON FEB 8 _ ఫిబ్ర‌వ‌రి 8న టిటిడి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

Tirupati, 6 February 2021:TTD is organising spot admissions on February 8 for remaining seats at the Sri Venkateswara junior College and Sri Padmavati Junior College.

The Education Department officials stated in a press release on Saturday that spot admissions would commence at 9 am on February 8 with preference to locals without hostel facility.

Students who applied in online http://admissions.‌tirumala.org had already undergone two rounds of counselling and seats allotted through a computerised lottery system.

Students seeking only college seats should appear for spot admissions at concerned junior colleges with all certificates and fees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 8న టిటిడి జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

తిరుప‌తి, 06 ఫిబ్ర‌వ‌రి 2021: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను మిగిలిన సీట్ల కోసం ఫిబ్ర‌వ‌రి 8న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు విద్యా విభాగం డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్ శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హాస్ట‌ల్ సీట్లు క‌ల్పించ‌బ‌డ‌వ‌ని, స్థానికుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని వివ‌రించారు.

ఇదివ‌ర‌కే http://admissions‌.tirumala.org ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థుల‌కు మొద‌టి, రెండో విడ‌త‌లో కౌన్సెలింగ్ నిర్వ‌హించి కంప్యూట‌ర్ లాట‌రీ ప‌ద్ధ‌తి ద్వారా సీట్లు భ‌ర్తీ చేశారు. క‌ళాశాల సీట్లు మాత్ర‌మే కావాల్సిన విద్యార్థులు సంబంధిత ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, ఫీజుల‌తో నేరుగా సంబంధిత జూనియ‌ర్ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లకు హాజ‌రుకావాల‌ని కోరడ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.