JEO INSPECTS SRINIVASAM & MADHAVAM QUARANTINE CENTRES _ మాధవం క్వారంటైన్ కేంద్రంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి తనిఖీలు
- JEO ASSURES ALL COVID FACILITATION TTD EMPLOYEES
- ADEQUATE OXYGEN AND MEDICINE AND NUTRITIONAL FOOD AT TTD QUARANTINES
– MOTIVATIONAL YOGA VIDEOS ON MOBILES OF EMPLOYEES
Tirupati, 24 Apr. 21: TTD JEO Smt Sada Bhargavi on Saturday directed officials to ensure all facilities like oxygen supply, medicines and nutritional food to TTD employees and their families who were admitted to the Covid quarantine centres.
On the directions of TTD EO Dr KS Jawahar Reddy the JEO inspected the Srinivasam and Madhavam quarantine Centre and reviewed all arrangements like beds, medicines, sanitation, medical teams, and PPE kits, Gloves, masks and face shields.
Thereafter she reviewed the situation with CMO, Additional Health officer, Covid Nodal officer and others.
Speaking later the TTD JEO instructed officials to make all arrangements including Yoga Centre for benefit of TTD employees and their family members admitted at the quarantine centres besides medicines and full medical care,
She said motivation videos on yoga treatment should be sent to mobiles of all employees with tips on doing it themselves besides conducting online yoga classes to them.
She also set up an emergency response team comprising of CMO, Additional Health Officer, Covid Nodal officer, TTD welfare officer, and a Doctor from BIRRD hospital
The JEO asked officials to stock adequate oxygen cylinders at the Madhavam quarantine centre and to deploy a dedicated sanitation and cleaning unit.
She instructed that arrangements should be made for providing Covid kits to TTD employees in-home quarantine and also to monitor their conditions regularly.
She asked all HoDs to ensure admission of their unit staff affected by Covid to quarantine centres and to motivate their family members.
She also directed DyEO of Annadanam at Tirupati Sri Lakshman Naik to ensure the provision of nutritional food to employees in quarantine as per the prescribed menu.
TTD CMO Dr Muralidhar, additional health officer Dr Sunil, Nodal officer Dr Bharat, BIRRD in charge RMO Sri Shailendra, TTD welfare officer Sri Ananda Raju and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు
– ఆక్సిజన్ , మందులు అందుబాటులో ఉంచుకోవాలి
– పోషకాహార ఆహారం అందించాలి
మాధవం క్వారంటైన్ కేంద్రంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి తనిఖీలు
తిరుపతి 24 ఏప్రిల్ 2021: కోవిడ్ సోకి క్వారంటైన్ కోసం వచ్చే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.
టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకోసం ఏర్పాటు చేసిన మాధవం క్వారంటైన్ సెంటర్ ను ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఆమె తనిఖీ చేశారు. ఇక్కడ సిద్ధం చేసిన బెడ్లు, మందులు, పారిశుధ్యం, వైద్యులు, సిబ్బంది అందుబాటు పరిస్థితులను ఆమె పరిశీలించారు. వైద్య సిబ్బందికి అందుబాటులో ఉన్న పిపిఈ కిట్లు, గ్లవుజులు, మాస్కులు, ఫేస్ షీల్డ్ లు పరిశీలించారు.
అనంతరం చీఫ్ మెడికల్ ఆఫీసర్, అదనపు ఆరోగ్యాధికారి, నోడల్ ఆఫీసర్ ఇతర అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవడానికి మందులు, పోషకాహారంతో పాటు యోగా చేయడం కోసం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి ఉద్యోగి మొబైల్ కు మోటివేషన్ వీడియోలు పంపి అవి ఎలా ఉపయోగించాలో కూడా చెప్పాలన్నారు.ఈ విధానంలో యోగా తరగతులు చెప్పడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీఎంఓ, అదనపు ఆరోగ్యాధికారి, కోవిడ్ నోడల్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, బర్డ్ నుంచి ఒక డాక్టర్ తో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు. మాధవం లో అవసరమైన ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. మాధవంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న
ఉద్యోగులకు కిట్స్ అందించి, వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. తమ విభాగంలో పని చేసే ఉద్యోగుల కు కోవిడ్ సోకితే క్వారంటైన్ సెంటర్ కు పంపడం, వారితో, వారి కుటుంబ సభ్యులతో మాటాడుతూ ధైర్యం నింపాలని విభాగాధిపతులను ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్ లోని వారికి మెనూ ప్రకారం పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నదానం తిరుపతి డిప్యూటి ఈవో శ్రీ లక్ష్మణ నాయక్ ను ఆదేశించారు.
సమీక్షలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ భరత్, బర్డ్ ఇంచార్జ్ ఆర్ ఎం ఓ శ్రీ శేష శైలేంద్ర, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ ఆనంద రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంతకు ముందు జెఈవో శ్రీమతి సదా భార్గవి శ్రీనివాసం క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ రోగులకు అందుబాటులో ఉన్న బెడ్లు, ఇతర సదుపాయాలను పరిశీలించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది