SRI RAMACHANDRA RIDES HANUMANTHA VAHANA _ హనుమంత వాహనంపై శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి

Vontimitta, 24 Apr. 21: On the fourth day of the ongoing annual Sri Kodandaramaswamy Brahmotsavam at Vontimetta, the utsava idols of Sri Sita, Lakshmana sameta Sri Ramachandra rode on Hanumanta vahana in ekantham due to COVID-19 guidelines on Friday night.

Puranic legends herald the glory of Hanuman, who was taught tenets of Dasa Bhakti by none other than Sri Rama which in turn was passed on by Hanumanta to his followers.

Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Inspector Sri Dhananjeyulu and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్‌ 24: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు సీతా, ల‌క్ష్మ‌ణ స‌మేతంగా ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గిరిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.