AP TO BECOME LEAD STATE IN ORGANIC FARMING -TTD EO _ ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చాలి- టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
ALL ANNA PRASADAM TO DEVOTEES WITH ORGANIC PRODUCTS
ENHANCE SOIL FERTILITY WITH COW DUNG AND COW URINE
MAKING AP CHEMICAL FREE AGRI BASIN IS MOTTO – EVV OF RySS
SEPARATE APP FOR ORGANIC FARMERS- MARKFED MD
Tirupati, 04 November 2022: TTD EO Sri AV Dharma Reddy on Friday called upon organic farmers to improve the soil fertility by extensive utilisation of cow dung and cow urine and as per the aspirations of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy to transform AP into a leader in organic farming.
He was participating in a meet with organic farmers from all the districts of AP at SVETA Bhavan on Friday jointly organised by TTD, Markfed and Rytu Sadhikara Samstha.
Speaking on the occasion the TTD EO said TTD had entered into an MOU with RySS and MARKFED in last October in the presence of AP CM to get organic products for making Srivari Prasadams thereby encourage organic farming in the state.
He said TTD had so far purchased 2500 tons of pulses after testing in national ITC labs to be pesticide free. During 2022, the TTD board had decided to buy 16,000 tons of 12 organic products through RYSS for Srivari Anna Prasadam and also donated over 2000 cattle to such farmers.
Speaking on the occasion Sri Vijay Kumar, Executive Vice Chairman of RySS said the Rythu Sadhikara Samstha supervises the organic crop raised by farmers ensuring pesticide free. He said lauded TTD for offering 15% above the MSP of MARKFED to encourage organic farmers.
Sri P S Pradyumn, Managing Director of MARKFED said all purchase are made transparently avoiding brokers and ensure farmers payments within 15 days and also break free supply to TTD throughout the year. He also said a separate app has been developed for organic farmers where they can even see the status of payment, quantity of produce available etc. in a transparent manner.
Earlier organic farmers including men and women from all regions of AP narrated their hands on experiences and thereafter the TTD EO felicitated the progressive achievers in organic farming.
TTD JEO for Education and Health Smt Sada Bhargavi, RySS CEO Sri Rama Rao, TTD Marketing GM Sri Subramaniam, CSA regional council Smt Chandrakala, ITC lab scientist Dr K Satyanarayana Murthy, Team Lead RySS Sri Prabhakar, SV Goshala Director Dr Harnath Reddy, SVETA director Smt Prashanti, DyEO Smt Padmavati and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చాలి
– గోమూత్రం, గోమయంతో భూసారాన్ని పెంచాలి
– భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో భక్తులకు అన్నప్రసాదాలు
– టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
– శ్వేతలో ప్రకృతి వ్యవసాయ రైతులతో ఆత్మీయ సమావేశం
తిరుపతి, 2022 నవంబరు 04: టిటిడి ఉచితంగా అందిస్తున్న గోవులను చక్కగా పోషించుకుని గోమూత్రం, గోమయంతో భూసారాన్ని పెంచాలని, ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల నుండి విచ్చేసిన ప్రకృతి వ్యవసాయ రైతులతో ఈవో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గతేడాది అక్టోబరులో ముఖ్యమంత్రివర్యులు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసినపుడు వారి సమక్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో టిటిడి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించేందుకు రైతు సాధికార సంస్థ గుర్తించిన రైతుల నుండి మార్క్‌ఫెడ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి టిటిడికి అందించాలని, తద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు గతేడాది మొదటి విడతగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 2500 టన్నుల శనగలను కొనుగోలు చేశమన్నారు. వీటిని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఐటిసి ప్రయోగశాలలో పరీక్షించగా ఎలాంటి రసాయన అవశేషాలు లేనట్టు గుర్తించారని తెలిపారు. ఈ ఏడాది మరో 12 రకాల ఉత్పత్తులు కలిపి దాదాపు 16 వేల టన్నులు సేకరించాలని టిటిడి బోర్డు నిర్ణయించిందని, ఈ మేరకు రైతు సాధికార సంస్థకు లేఖ ద్వారా తెలియజేశామని చెప్పారు. రానున్న కాలంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడికి అవసరమైన అన్ని వంట సరుకులను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవే కొనుగోలు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు రెండు వేలకు పైగా గోవులు, ఎద్దులను ఉచితంగా అందించామని వెల్లడించారు.
రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మన్ శ్రీ విజయకుమార్ మాట్లాడుతూ టిటిడికి అవసరమైన ఉత్పత్తులను పండించేందుకు ప్రకృతి వ్యవసాయ రైతులను గుర్తించి, పంటకాలంలో ఎలాంటి రసాయన పురుగుమందులు వాడకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన ఉత్పత్తుల శాంపిళ్లను పరీక్షించగా ఎలాంటి రసాయన అవశేషాలు లేవని, నిపుణులు సైతం ఆశ్చర్యపోయారని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ధర కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే 10 శాతం అదనంగా టిటిడి చెల్లిస్తోందని, అదేవిధంగా మార్కెట్ ధర కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరపై 15 శాతం అదనంగా చెల్లిస్తామని టిటిడి ఒప్పందం చేసుకుందన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు టిటిడి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
మార్క్‌ఫెడ్ ఎండి శ్రీ పిఎస్.ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ రైతులు దళారుల కారణంగా నష్టపోకుండా మార్క్‌ఫెడ్ పూర్తి పారదర్శకంగా వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి త్వరితగతిన సొమ్ము చెల్లిస్తున్నట్టు తెలిపారు. సిఎం యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రకృతి వ్యవసాయ రైతులతో లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. టిటిడికి అవసరమైన ఉత్పత్తులను సంవత్సరం పొడవునా సరఫరా చేయాల్సి వస్తుందని, ఇందుకోసం రైతుల నుండి ఎప్పటికప్పుడు కొనుగోలుచేసి నిల్వ ఉంచుకుంటామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ రైతులకు 15 రోజుల్లోపు పంట కొనుగోలు సొమ్ము చెల్లిస్తున్నామని తెలియజేశారు.
ముందుగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రకృతి వ్యవసాయ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంచి దిగుబడులు సాధించిన రైతులను టిటిడి ఈవో ఇతర అధికారులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి, రైతు సాధికార సంస్థ సిఈవో శ్రీ రామారావు, టిటిడి మార్కెటింగ్ జిఎం శ్రీ సుబ్రహ్మణ్యం, సిఎస్ఏ రీజనల్ కౌన్సిల్ శ్రీమతి చంద్రకళ, ఐటిసి ల్యాబ్ శాస్త్రవేత్త డా.కె.సత్యనారాయణమూర్తి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, డెప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.