AVABHRUDA SNANAM PERFORMED_ వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Tirumala, 21 September 2018: The nine day annual brahmotsavams in Tirumala concluded with Avabhruda Snanam also known as Chakra Snanam on Friday morning.

Processional deities of Sri Malayappa Swamy and His concerts Sridevi and Bhudevi along with Sudarshana Chakram (Disc weapon of Vishnu) were rendered snapana tirumanjanam at Varaha Swamy temple on the banks of Swamy Pushkarini.

Large number of devotees gathered since early hours to take a holy dip in the waters of Pushkarini to get free from sins. The LED screens which were placed on the four sides of Nirali Mandapam located inside Swamy Pushkarini provided a clear live telecast of the entire event to devotees. Each time when bharati was rendered, the hill town reverberated to the chants of Govinda Nama by scores of pilgrims.

Later, the Sudarshana Chakra, which is believed as anthropomorphic form of lord, was immersed in the waters of Swamy Pushkarini at the auspicious hour. The devotees too took a holy dip at the moment.
As the sanctity of the Chakra Snanam is believed to prevail the whole day, the pilgrims took celestial bath in the holy waters in a phased way, the entire day.

TTD Chairman Sri Putta Sudhakar Yadav, TTD EO Sri Anil Kumar Singhal, TTD Board Members Sri GSS Sivaji, Sri Potluri Ramesh Babu, Smt Sudha Narayanamurthy, Sri N Krishna, JEO’s Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, incharge CVSO Sri Sivakumar Reddy, VGO Sri Raveender Reddy,Temple DyEO Sri Haridranath, Peishkars Sri Ramesh, Sri Nagaraj and large number of devotees took part.

EO THANKS ALL

Speaking on the occasion, TTD EO Sri Anil Kumar Singhal, said, with the benign blessings of Lord Venkateswara, the nine day annual event concluded on a successful note with Chakra Snanam today. All the departments have put their extra efforts to make this mega religious event, a hassle free successful one. I thank the pilgrims for their cooperation and congratulate all the officers, employees, scouts and guides, srivari sevakulu, police and district administration towards the grand success of the mine day brahmins avand, he maintained.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

తిరుమల, 21 సెప్టెంబరు 2018: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

అంతకుముందు తెల్లవారుజామున 5.00 నుండి 7.30 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 7.30 నుంచి 10.00 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.

చక్రస్నానం (అవభృథం)లో శ్రీవారి సుదర్శనచక్రంకు (చక్రత్తాళ్వార్‌కు) పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూసమేతమలయప్పమూర్తికి ‘స్నపన తిరుమంజనం’ నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శవల్ల పవిత్రమైన పుష్కరిణీజలంలో భక్తసమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.

చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది.

ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.

అనంతరం రాత్రి 7.00 నుండి 9.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. రాత్రి 9.00 నుండి 10.00 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

ఈ కార్యక్రమాల్లో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఛైర్మ‌న్ శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీమ‌తి సుధా నారాయ‌ణ‌మూర్తి, శ్రీ శివాజి, శ్రీ శ్రీ‌కృష్ణ‌, తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జ్ సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, విశేష‌ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.