AVOID ASPERSIONS – TIRUMALA JEO APPEALS TO FORMER CHIEF PRIEST_ టిటిడిపై ఆరోపణలకు ముగింపు పలకండి : మాజీ ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితులకు జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు విజ్ఞప్తి

Tirumala, 22 June 2018: Furnishing the details to clear the air surrounding the baseless allegations made by former Chief Priest of Tirumala temple Sri Ramana Deekshitulu, the Tirumala JEO Sri KS Sreenivasa Raju appealed him to put an end to the chaos.

A press conference was held by Tirumala JEO at Annamaiah Bhavan on Friday in Tirumala. Briefing the media, JEO said, the renovation of Prasada Potu was carried out only after taking the consent from Agama Advisor Sri Sunderavaradan and Tirumala Pedda Jiyangar Swamy.

“This was done keeping in view the safety of temple structure and the potu workers. After consulting the agama stalwarts only we had shifted prasadam potu to padi potu. During the period from 09.12.17 to 05.01.18, when the repairs are under way in Prasadam potu, the Annaprasadams were prepared in Padi Potu and Naivedyam was offered to lord as was done in 2001 and 2008 when similar renovation was carried out. Even some works are not taken, honouring the opinion of Sri Ramana Deekshitulu. No deviation has taken place in offering Naivedyam to lord as alleged by respected Sri Ramana Deekshitulu. Even the kainkaryams like Thomala and other sevas are being performed as per the tenets of Vaikhanasa Agama only without any deviance”, he asserted.

“We have never interfered in religious matters nor behaved with nonchalance attitude towards our priests and religious staffs. While taking up any development or renovation work related to temple, we approach Agama Advisors. We have five of them including Sri NAK Sunderavaradan, Sri Mohanarangacharyulu, Sri Desikacharyulu, Sri Jagamnadhacharyulu apart from Sri Ramana Deekshitulu”.

On the remarks of Sri Deekshitulu made on no safety for jewelry of Lord, JEO reacted, every year we carry out verification of jewels for 20 days in Tirumala temple (in vaikuntha dwaram). The verified jewels are entered in the Tiruvabharanam register and the process in Agama jargon is called Jetti. When the temple remains open for nealy 22 and a half hours a day, with not less than 65,000 Pilgrims having darshan of Lord, the allegations on safety of jewels doesn’t arise and are totally baseless.

Appealing to former TTD Priest Sri Ramana Dikshitulu, the JEO sought him to put an end to ruckus. “Respected Sri Ramana Deekshitulu Garu, you had served the Lord for so many decades. You have earned lot of virtuous merits (punya) through your service to Lord Venkateswara. Please avoid mudslinging and enjoy your retired life with peace and prosperity.

Every one irrespective of their cadre and status are devotees of Lord. Playing with the sentiments of millions of people across the world is not correct. Just because you name or involve big wigs in this baseless allegations, they will not become true. I am once again appealing you to stop this hullabaloo and avoid creating unnecessary panic or confusion among pilgrims. JEO also appealed to the devotees of Lord Venkateswara speed across the globe to stop paying attention towards these issues which are completely void of truth.

CE Sri Chandrasekhar Reddy, SE II Sri Ramachandra Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడిపై ఆరోపణలకు ముగింపు పలకండి : మాజీ ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితులకు జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు విజ్ఞప్తి

జూన్‌ 22, తిరుమల 2018: ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కోట్లాది మంది శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గత కొంత కాలంగా టిటిడి మాజీ ప్రధానార్చకులు శ్రీ రమణదీక్షితులు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు ఇక ముగింపు పలకాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం జెఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని ముఖ్యాంశాలు జెఈవో మాటల్లోనే…

శ్రీవారి ఆలయంలో ప్రసాదం పోటు, పడిపోటు ఉన్నాయి. విమాన ప్రాకారంలో తాయార్లతో కూడిన అన్నప్రసాదం పోటులో స్వామివారికి నైవేద్యం కోసం ప్రసాదాలు తయారుచేస్తారు. రెండో ప్రాకారమైన సంపంగి ప్రాకారంలో పడి పోటు ఉంది. ఇక్కడ స్వామివారికి సమర్పించే లడ్డూ, వడ, దోశ ఇతర ప్రసాదాలు తయారు చేస్తారు. అనాదిగా శాస్త్ర సమ్మతమైన పుస్తకాలను పరిశీలిస్తే అన్నప్రసాదం పోటులో ప్రసాదాలు తయారుచేయలేని పక్షంలో పడిపోటులో ప్రసాదాలు తయారుచేసి సమర్పిస్తున్న విషయం అవగతమవుతుంది. 2001వ సంవత్సరంలో ఆగమ సలహామండలి సలహా మేరకు ప్రసాదం పోటులో, పడిపోటులో ఆలయ సంస్కృతిని ప్రతిబింబించేలా స్తంభాలను తీర్చిదిద్దేందుకు సంపంగి ప్రాకారంలో వెలుపల షెడ్డు వేసి తాత్కాలికంగా శాస్త్రోక్తంగా ప్రసాదాలు తయారుచేయడం జరిగింది.

2007లో అన్నప్రసాద పోటులో అగ్నిప్రమాదం జరిగినపుడు కూడా పడిపోటులో ప్రసాదాల తయారీ జరిగింది. 2008లో తిరిగి అన్నప్రసాద పోటులో మరమ్మతులు చేసినపుడు కూడా పడిపోటులోనే అనప్రసాదాలు తయారు చేయడం జరిగింది. ఆ తరువాత శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌, ఆగమ సలహామండలి సభ్యుల సూచనల మేరకు 2017 డిసెంబరు 9 నుండి 2018, జనవరి 5వ తేదీ వరకు ప్రసాదం పోటులో అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంలోనూ గతంలో చేసిన విధంగానే సంపంగి ప్రాకారంలో షెడ్డు వేసి ప్రసాదాలు తయారు చేశాం. అయితే, ఇప్పుడు ప్రసాదాలు మలినమైనట్టు భావించడం ఎంతవరకు సబబు? ఈ విషయాన్ని భక్తులు నిశితంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఆగమ సలహామండలి సభ్యులు ఒక్కరే కాదు, ఐదుగురు ఉంటారు. వీరిలో శ్రీ అప్పికట్ల దేశికాచార్యులు, శ్రీ సుందరవదనాచార్యులు, శ్రీ జగన్నాథాచార్యులు, శ్రీ మోహనరంగాచార్యులు, శ్రీ రమణ దీక్షితులు ఉన్నారు. ఆలయానికి సంబంధించిన ఏ పని చేయాలన్నా సందర్భానుసారంగా సలహా మండలి సభ్యుల నుండి సమష్టిగాను లేదా వ్యక్తిగతంగాను సలహాలు స్వీకరించే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో 2017 డిసెంబరులో జరిగిన అన్నప్రసాదం పోటు మరమ్మతులకు సంబంధించి శ్రీశ్రీశ్రీపెద్దజీయర్‌స్వామి, ఆగమ సలహా మండలి సభ్యులు శ్రీ సుందరవదనాచార్యుల నుండి సలహాలు స్వీకరించాం. ఈ విధంగా మరమ్మతులు మొదలుపెట్టిన తరువాత డిసెంబరు 24న ఈవోగారికి శ్రీ రమణదీక్షితులు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈవోగారి ఆదేశాల మేరకు చీఫ్‌ ఇంజినీర్‌, ఎస్‌ఇ, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పోటు కార్మికులతో సహా తాను వెళ్లడం జరిగింది. 20 నిమిషాలు పాటు శ్రీ రమణదీక్షితులు పరిశీలించి ఆలయగోడలు, ఫ్లోరింగ్‌ను కదిలించలేదన్న విషయాన్ని గుర్తించారు. అక్కడే ఆయన ఫిర్యాదులకు వివరణ ఇవ్వడం జరిగింది.

ఈ పోటులో పొయ్యిల వేడి నుండి ఆలయ గోడలను కాపాడేందుకు వాటికి అనుసంధానంగా అంతకుముందే రిఫ్రాక్టరీ బ్రిక్‌ వాల్స్‌ ఉండేవి. వేడి కారణంగా ఇవి తరచూ మరమ్మతులకు గురవుతూ ఉంటాయి. ఈ క్రమంలో రిఫ్రాక్టరీ బ్రిక్‌ వాల్‌ మరమ్మతులు చేసినపుడు అక్కడ కొన్ని గోడ శకలాలు పోగయ్యాయి. వాటిని కూడా శ్రీరమణ దీక్షితులు పరిశీలించారు. గోడలకు కానీ, ఫ్లోరింగ్‌కు కానీ ఎలాంటి గుణపం పోటు పడలేదన్న విషయాన్ని వారు పరిశీలించి సంతృప్తి చెందారు. అయితే, పోటులో ఈశన్య దిశలో ఒక స్తంభం కూలిపోయే స్థితిలో ఉంటే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులను సంప్రదించడం జరిగింది. ఈ స్తంభం మరమ్మతులతోపాటు పొయ్యిలు మార్చడానికి, రిఫ్రాక్టరీ బ్రిక్‌ వాల్‌ మార్చడానికి కలిపి రూ.24.50 లక్షలతో పనులు చేపట్టేందుకు ఈవో ఆమోదించారు. పోటులో ఈ అభివృద్ధి పనుల కోసం సమావేశం నిర్వహించి ఆగమ సలహా మండలి సలహాలు తీసుకోవడం జరిగింది.

అయితే, ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులు ఈ విషయాన్ని టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌తో చర్చించారు. కానీ, చీఫ్‌ ఇంజినీర్‌ ఈ పనులకు ఆమోదం తెలుపలేదు. ఈ కారణంగా స్తంభం పనులను ముట్టుకోకుండా రిఫ్ట్రాక్టరీ బ్రిక్‌ వాల్‌ను, ఫ్లాట్‌ఫారమ్‌ను మాత్రమే పునర్నిర్మించాం. జనవరి 6, 7వ తేదీల్లో పుణ్యహవచనం ఇతర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి జనవరి 8న అన్నప్రసాదాల తయారీని తిరిగి ప్రారంభించాం. ఇందుకోసం రూ.11.15 లక్షలు మాత్రమే ఖర్చు అయింది. వాస్తవాలు ఇలా ఉండగా, పోటు మరమ్మతుల విషయంలో గౌ|| ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకురావడం సబబు కాదు. పోటులో ఆ స్తంభం పనులు అలాగే వదిలేసిన విషయం వాస్తవం కాదా?

శ్రీరమణదీక్షితులు అనుమానాలు కలిగేరీతిలో వ్యవహరించడం బాధాకరం. 40 సంవత్సరాల పైబడి సేవ చేసిన శ్రీ రమణదీక్షితులు అవాస్తవాలను చెప్పడం, ఆరోపణలు చేయడం, పెద్దవారి పేర్లను తీసుకురావడం భావ్యం కాదు. ఏ అధికారి కూడా కైంకర్యాల విషయంలో జోక్యం చేసుకోలేదు. తోమాల సేవ సమయంలో అధికారులు, ఆలయ సిబ్బంది ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో తోమాల సేవను త్వరగా చేయాలని ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఉత్పన్నం కాదు. మీ పట్ల అధికారులకు, ఉద్యోగులకు ఎంతగానో గౌరవం ఉంది. అబద్ధం ఎక్కువకాలం నిలబడదు. అర్చకులను స్వామి అని మాత్రమే గౌరవంగా సంబోధిస్తాం. అర్చకులు చేసే పొరపాట్లను ఏనాడు తాము ప్రశ్నించలేదు. తోమాల సేవలో యమునోత్తరై నుండి మాత్రమే తోమాలపొట్టంగా వచ్చిన పూలను స్వామివారికి అలంకరించాలి, అగరబత్తీని చుట్టకూడదు. అలా చేసినా ఏనాడు అభ్యంతరం తెలపలేదు. ఇతర అర్చకులు చేసిన ఫిర్యాదు మేరకు 2010లో అప్పటి ఈవో జారీ చేసిన ఉత్తర్వులను తిరిగి మరోసారి జారీ చేయడం జరిగింది.

ప్రతి సంవత్సరం వైకుంఠ ద్వారం వద్ద ఎఫ్‌ఏ,సిఏవో ఆధ్వర్యంలో ఆభరణాల పరిశీలన జరుగుతుంది. తిరుమల జెఈవో, సివిఎస్‌వో పరిశీలిస్తారు. కాలక్రమేణా జరిగిన మార్పుల్లో భాగంగా జ్యువెలరీ అప్రైజర్‌, ఇన్వెంటరీ విభాగం అధికారి, జ్యువెలరీ టెక్నికల్‌ అడ్వైజరి కమిటీ, స్టేట్‌ ఆడిట్‌ అధికారుల సమక్షంలో 20 రోజులకు తక్కువ కాకుండా పరిశీలన జరుగుతుంది. బొక్కసం సూపరింటెండెంట్‌ ఆభరణాల రిజిస్టర్‌ను కలిగి ఉంటారు. ఆభరణాల్లో చిన్నరాయి రాలినా దాన్ని నమోదు చేసే సంస్కృతి ఉంది.

స్వామివారు ఇక్కడ వెలసిన కారణంగా తిరుపతి పట్టణం అభివృద్ధి చెందుతోంది, స్థానికులు అభివృద్ధి చెందుతున్నారు. శ్రీవారి ఆలయంలో గుండుసూది కూడా బయటకు రావడానికి అవకాశం లేదు. పటిష్టమైన భద్రత, సిసిటివిల నిఘా ఉంటుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి ఇతర ప్రముఖులు వారి హోదాను పక్కనపెట్టి సామాన్య భక్తులతోపాటు స్వామివారి ఎదుట మోకరిల్లి ఆశీస్సులు అందుకుంటున్నారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో నాలుగు దశాబ్దాలపాటు శ్రీవారికి సేవ చేసిన మీరు ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు చేయడం తగునా. ఈ ఆరోపణలకు ఇకపై ముగింపు పలకాలని లక్షలాది మంది భక్తుల తరఫున కోరుకుంటున్నాను.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.