35TH SANATANA DHARMIC EXAM RESULTS ANNOUNCED_ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదల చేసిన తిరుపతి జెఈవో

Tirupati, 22 Jun. 18: The top three prize winners at state and district level of 35th Sanatana Dharma exam results have been declared by Tirupati JEO Sri P Bhaskar.

The prizes were given away to the winners in SVETA building on Friday.

Of the total number of students who attended the epic exams from two Telugu speaking states and Tamilnadu, consisted of 30,686 are girls and 28,668 boys. Among them 81℅ passed out.

JEO Sri P Bhaskar given the prizes to winners. HDPP secretary Sri Ramana Prasad, Epic exams co-ordinator Sri Damodar Naidu were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదల చేసిన తిరుపతి జెఈవో

తిరుపతి, 2018, జూన్‌ 22: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు, చెన్నైలోని తెలుగు విద్యార్ధిని, విద్యార్ధులకు నిర్వహించిన 35వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ విడుదల చేశారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ హిందూ సనాతన సంప్రదాయాలు, నైతిక విలువలు, పురాణాలు లాంటి పలు విషయాలను అధ్యయనం చేసి ధార్మిక విజ్ఞాన పరీక్షలు రాసి విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 47,950 మంది పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 30,686 మంది బాలికలు, 28,668 మంది బాలురు ఉన్నారని, ఇందులో 81 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

ఒక్కో విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో వేరువేరుగా ర్యాంకులు ప్రకటించినట్టు జెఈవో తెలిపారు. సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో రాష్ట్రస్థాయిలోను, ప్రతి జిల్లాలోను ప్రథమ, ద్వితీయ, త తీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు త్వరలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

ధర్మపరిచయంలో చిత్తూరు విద్యార్థినికి మొదటి ర్యాంకు :

ధర్మపరిచయం విభాగంలో రాష్ట్రస్థాయిలో చిత్తూరుకు చెందిన దేవి బాలమందిర్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఎమ్‌.పద్మాశ్రీ మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. కృష్ణా జిల్లా విజయవాడలోని శుబోదయ హైస్కూల్‌ 8వ తరగతి విద్యార్థిని బి.ఎమ్‌.ఎల్‌. మధులత రెండో ర్యాంకు, ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లోని టిఎస్‌ఆర్‌ బాలికల పాఠశాల 8వ తరగతి విద్యార్థిని పి.ప్రవళ్లిక మూడో ర్యాంకు సాధించారు.

సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో జిల్లాల వారీగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వివరాలను జతపరచడమైనది.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణ ప్రసాద్‌, ఏపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి ఆచార్య దామోదర్‌ నాయుడు, సూపరిెంటెండెంట్‌ శ్రీ ప్రసాద్‌రెడ్డి, శ్రీగురునాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.