TTD EO FELICITATES AVSO_ టిటిడి ఎవిఎస్వో శ్రీ సురేంద్రకు ఈవో అభినందన
Tirupati, 4 September 2019: TTD Executive Officer Sri Anil Kumar Singhal on Wednesday felicitated Sri Allam Surendra, the AVSO at Alipiri Checkpoint for his distinct performance at the World Police and Fire Games -2019 meet in China where he bagged Gold and Silver medals.
The EO felicitated Sri Surendra at his chambers in the TTD administrative building on Wednesday.
CVSO Sri Gopinath Jatti was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ఎవిఎస్వో శ్రీ సురేంద్రకు ఈవో అభినందన
తిరుపతి, 2019 సెప్టెంబర్ 04: టిటిడిలో అలిపిరి చెక్ పాయింట్ ఎవీఎస్వోగా విధులు నిర్వహిస్తున్న శ్రీ అల్లం సురేంద్రను టిటిడి పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు. ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్- 2019 పోటీలలో ఈయన బంగారు, వెండి పతకాలు సాధించారు.
చైనాలోని చెంగ్డు రాష్ట్ర కేంద్రంలో జరిగిన ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్- 2019లో శ్రీ అల్లం సురేంద్ర బంగారు, వెండి పతకాలు సాధించారు. ఆగస్టు 8 నుండి 18వ తేదీ వరకు ఈ క్రీడాపోటీలు జరిగాయి. 40 ఏళ్ల కేటగిరీలో టెన్నిస్ డబుల్స్ పోటీల్లో బంగారు పతకం, సింగిల్స్ పోటీల్లో వెండి పతకం సాధించారు.
ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.