MAHA GOV ALLOTS LAND TOWARDS THE CONSTRUCTION OF BALAJI TEMPLE AT BANDRA_ ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు

Tirupati, 4 Sep. 19: In a welcoming move, the Honourable CM of Maharashtra Sri Devendra Fadnavis has handed over the Land Allotment Orders towards the construction of Sri Tirupati Balaji Venkateswara Swamy temple to TTD Joint Executive Officer Sri P Basant Kumar, IAS on Tuesday evening at CM’s official residence Varsha. Earlier, during the day, the Collector of Mumbai suburban district, Sri Milind Borikar has given the possession orders to TTD JEO.

The Honourable Finance Minister of Maha Government Sri. Sudhir Mungatiwar, the Local Advisory Committee (LAC) members Sri. V. Ranganathan, Dr. Gita Kasturi, Sri Samir K. Mehta were also present.

Upon the request of TTD Executive Officer Sri Anil Kumar Singhal, the Government of Maharashtra allotted 648sq m of land in its prime area at Bandra (East) towards the construction of Sri Venkateswara Swamy temple with Information Centre.

It may be mentioned here that, Tirumala Tirupati Devasthanams (TTD), the Hindu religious institution situated in Andhra Pradesh manages the world-famous Hill Shrine of Sri Balaji Venkateswara Swamy temple. According to legend, Lord Balaji is believed to be an incarnation of Sri Maha Vishnu in Kaliyuga.

In order to provide information regarding accommodation, darshan, sevas, amenities to pilgrims etc. TTD has already established a temple cum Information Centre in the rented premises in Sion at Mumbai.

The proposed construction of the temple cum information center which will be in offing in Bandra East will have the temple with Garbhalayam housing the main deity, Artha Mandapam, Mukha Mandapam in the elevated first floor and Potu-the temple kitchen, meditation hall in the basement. The information center cum accommodation requirements will also be accommodated in the same premises as per the plans and designs being finalized by Stapathis of TTD in consultation with the reputed Architectural firm.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు

తిరుపతి, 2019 సెప్టెంబరు 04: దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 6,975 చ.అడుగుల (16 సెంట్లు) స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌ||శ్రీదేవేంద్ర ఫడ్నవీస్‌ ముంబయిలోని తన అధికార నివాసంలో స్థలం కేటాయింపు ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీపి.బసంత్‌కుమార్‌కు అందజేశారు.

దేశవ్యాప్తంగా శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణానికి టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ముంబయిలో స్థలం కోసం చాలాకాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వినతి మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని ప్రధాన ప్రాంతమైన తూర్పు బాంద్రాలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం అనుభవ ఉత్తర్వులను ముంబయి సబర్బన్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ మిలింద్‌ బోరికర్‌ టిటిడి జెఈవోకు అందజేశారు. ఈ స్థలంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంతోపాటు సమాచార కేంద్రాన్ని టిటిడి నిర్మించనుంది.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ సుధీర్‌ ముంగటివార్‌, టిటిడి ఎస్టేట్‌ అధికారి శ్రీ విజయసారధి, డెప్యూటీ ఈవో శ్రీ విశ్వనాథ్‌, స్థానిక సలహా మండలి సభ్యులు శ్రీవి.రంగనాథన్‌, డా.గీతా కస్తూరి, శ్రీ సమీర్‌ కె.మెహెతా తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.