AYODHYA RAMA MANDIRAM FOR SPROUTING BHAKTI CHAITANYA- TTD CHAIRMAN _ భక్తి చైతన్యం రగిలించడానికే అయోధ్యలో రామాలయ నిర్మాణం -⁠ ⁠టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

Tirupati,16 January 2024: TTD Chairman Sri Bhumana Karunakar Reddy said on Tuesday the construction of the Ram Mandir at Ayodhya is aimed at inspiring Bhakti culture and expressed that he is blessed to get an invitation for participating in the prestigious Ram Mandir inauguration program on January 22.

He was participating in the Koti Hanuman Chalisa Parayana Maha Yajnam organised by Sri Hanumanta Diksha Peetham from January 14 at Sri Ramachandra Pushkarani in Tirupati and also performed special pujas for Sri Sitarama and Sri Anjaneya Swamy.

Speaking on the occasion he said as a primary servant of Sri Venkateswara Swamy he was participating in the unique program for the well-being of every living being on the earth.

He said he had developed the Ramachandra Pushkarani during his first stint as TTD Chairman and developed it as a devotional hub and reiterated that service to mankind is service to God.

Vishwa Hindu Parishad leader Sri Raghavulu lauded the Sanatana Hindu Dharma Pracharam being taken up by TTD under the leadership of Sri Bhumana  Karunakara Reddy.

Dr Akella Vibhishana Sharma, Director of the Annamacharya Project, others and devotees were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తి చైతన్యం రగిలించడానికే అయోధ్యలో రామాలయ నిర్మాణం -⁠ ⁠టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి
.
తిరుపతి 16 జనవరి 2024: ప్రజల్లో భక్తి చైతన్యం రగిలించడానికే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. రామ మందిర ప్రారంభ మహోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.

టీటీడీ సహకారంతో రామచంద్ర పుష్కరిణి ఆవరణంలో శ్రీ హనుమద్ దీక్షా పీఠం జనవరి 14వ తేదీ నుండి నిర్వహిస్తున్న కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం లో మంగళవారం చైర్మన్ పాల్గొన్నారు. శ్రీ సీతారాములు, శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. అనంతరం శ్రీ కరుణాకర రెడ్డి భక్తులనుద్దేశించి మాట్లాడారు. తాను శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రథమ సేవకుడినైనప్పటికీ శ్రీ రామ భక్తుడినేనని అన్నారు. సృష్టి లోని ప్రతి ప్రాణి ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ యజ్ఞం నిర్వహించుకోవాలనే శ్రీ రామ చంద్రుడు తాను తొలిసారి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు రామ చంద్ర పుష్కరిణిని ఆధ్యాత్మిక స్థలంగా అభివృద్ధి చేయించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మానవ సేవకు మించిన భగవద్సేవ లేదనే విషయం గుర్తించి ప్రతి ఒక్కరు చేతనైన సేవ చేయాలని శ్రీ కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు.

విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు శ్రీ రాఘవులు మాట్లాడుతూ శ్రీ కరుణాకర రెడ్డి నేతృత్వంలో సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు.
అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ, శ్రీ నందనం పాటి రామాంజనేయులు, శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ, శ్రీ సాకం ప్రభాకర్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 21వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుండి ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో జరిగే కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞం తో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది