AYODHYAKANDA AKHANDA PARAYANAM ON APRIL 6 _ ఏప్రిల్ 6న అయోధ్యకాండ 9వ విడ‌త‌ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 04 APRIL 2024: The Ninth edition of Ayodhyakanda Akhanda Parayanam will be held in Nada Neerajanam platform at Tirumala on Saturday between 7am and 9am.

As part of it 172 shlokas from Chapters 31-34 besides 25 shlokas from Yogavasistyam and Dhanwantari Maha Mantram will be recited.

Vedic scholars and devotees participate in this event and will be telecast live by SVBC for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 6న అయోధ్యకాండ 9వ విడ‌త‌ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2024 ఏప్రిల్ 04: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఏప్రిల్ 9వ తేదీ శ‌నివారం 9వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

అయోధ్యకాండలోని 31 నుండి 34వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం నాలుగు స‌ర్గ‌ల్లో 172 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 197 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.