AYODHYAKANDA AKHANDA PARAYANAM ON AUGUST 14 _ ఆగస్టు 14న రెండవ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణం
TIRUMALA, 13 AUGUST 2023: The second edition of Ayodhyakanda Akhanda Parayanam will be held at Nadaneerajanam in Tirumala on Monday between 7am and 9am.
A total of 199 Shlokas will be recited by Vedic scholars, devotees on the occasion.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 14న రెండవ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణం
తిరుమల, 13 ఆగస్టు 2023: లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆగస్టు 14న సోమవారం రెండవ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
అయోధ్యాకాండలోని 4 నుండి 8వ సర్గల వరకు గల 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. అదేవిధంగా యోగవాశిస్టం, ధన్వంతరి మహామంత్రం కలిపి 25 శ్లోకాల పారాయణం జరుగుతుంది. మొత్తం 199 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్వి వేద విఙ్ఞాన పీఠం, ఎస్వివేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.