AYODHYAKANDA PARAYANAM BEGINS AT VASANTHA MANDAPAM _ వసంతమండపంలో అయోధ్యకాండ పారాయణం ప్రారంభం
Tirumala, 21 Oct. 21: The spiritual endeavour of TTD to save humanity from the pandemic Corona Ayodhyakanda parayanam Diksha commenced at Vasantha mandapam in Ekantha as per covid guidelines on Thursday morning.
The latest edition of Ramayana Parayanam launched by TTD for over a year will last for 27 days till November 16 and the proceedings will be daily telecast by the SVBC channel.
Speaking on the occasion Sri KSS Avadhani, principal of Dharmagiri Veda vijnan peetham said Parayana Diksha of Ramayana shlokas enriched everyone with wisdom, devotion, commitment and finally Moksha.
He said of the 4308 shlokas in 119 sargas of Ayodhyakanda, on Thursday 16 Vedic pundits performed parayanams of 291 shlokas from1-7 sargas. Simultaneously 16 upasakas performed Homas, japam with Mula mantra pathana of Hanumanta, Sita Lakshmana sameta Sri Rama at the Dharmagiri Veda vijnan peetham from morning to evening. In all 32 Veda pundits were engaged in the Ayodhyakanda parayanams, he said.
Vedic pundits, officials and archakas were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వసంతమండపంలో అయోధ్యకాండ పారాయణం ప్రారంభం
తిరుమల, 2021 అక్టోబరు 21: శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంత మండపంలో అయోధ్యకాండ పారాయణం గురువారం ప్రారంభమైంది. నవంబరు 16వ తేదీ వరకు 27 రోజుల పాటు ఈ పారాయణం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ శ్రీమద్రామాయణ పారాయణం ఒక జ్ఞానయజ్ఞమన్నారు. వేదస్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి కలుగుతాయని, వీటి ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పారు.
సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలో సంచరించేటప్పుడు పితృవాక్యా పరిపాలన, సీతమ్మవారు పతివ్రత ధర్మం, లక్ష్మణ స్వామివారు సోదర ధర్మం వంటి అనేక ధర్మాలను తేలియజేస్తుంది కావున అయోధ్యకాండను ధర్మకాండ అని అంటారన్నారు. రామాయణంలోని అయోధ్యకాండ పారాయణం చేసిన, విన్న ప్రతి ఒక్కరికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. ఇందులో శ్రీరామచంద్రమూర్తి అందరికి ధనం, ధాన్యం, గోవులు, ఏనుగులు తదితర వాటిని దానం చేసినట్లు తెలిపారు.
అయోధ్యకాండలోని మొత్తం 119 సర్గల్లో 4,308 శ్లోకాలు ఉన్నాయన్నారు. మొదటి రోజైన గురువారం ఉదయం 1 నుండి 7వ సర్గ వరకు ఉన్న 291 శ్లోకాలను 16 మంది వేద పండితులు పారాయణం చేసినట్లు తెలిపారు.
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ….
మరోవైపు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 16 మంది ఉపాసకులు ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, జపాలు, హనుమంత, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూలమంత్రానుష్టానం జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో మొత్తం 32 మంది వేదపండితులు పాల్గొంటున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద విజ్ఞానపీఠం పండితులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.