AYUDHA PUJA HELD _ భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కోసం ఆయుధ‌పూజ : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి,

TIRUMALA, 08 DECEMBER 2022: The Ayudha Puja was observed in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) in Tirumala on Thursday.

TTD EO Sri AV Dharma Reddy who performed Puja to the machinery, utensils etc. speaking on the occasion said, the Annaprasadam wing of TTD has been observing the Ayydha Puja since 1983.

Seeking the divine intervention for the everlasting services of Annaprasadam distribution to the multiple devotees, the Ayudha Puja is being observed every year, he added.

Deputy EO Sri Selvam, Special Officer Sri GLN Shastry, Health Officer Dr Sridevi, VGOs Sri Bali Reddy, AEOs Sri Gopinath, Gangadharam and other Annaprasadam staff members were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కోసం ఆయుధ‌పూజ : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి,

తిరుమల, 2022 డిసెంబర్ 08: శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ జ‌ర‌గాల‌ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ప్రార్థిస్తూ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఆయుధ‌పూజ నిర్వ‌హించిన‌ట్టు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఉదయం జరిగిన ఆయుధపూజలో ఈవో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద భవనంలో సాంప్రదాయబద్ధంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. దాతల సహకారంతో భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు అందిస్తూ, ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. తిరుమలలో 1983 వ సంవత్సరం ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం 2009లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం నిర్మించి రోజుకు దాదాపు 14 గంటల పాటు నిరంతరాయంగా భక్తులకు అత్యద్భుతమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం ఆల్ఫాహారం, మధ్యాహ్నం, రాత్రి రుచికరమైన భోజనాలు అందిస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి వినియోగించే సామ‌గ్రికి, యంత్రాల‌కు పూజ‌లు చేసిన‌ట్టు వివ‌రించారు.

అంతకుముందు అన్నప్రసాద భవనంలో శ్రీవారి చిత్రపటానికి, వంట పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, ప్రత్యేక అధికారి శ్రీ జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, విజివో శ్రీ బాల్ రెడ్డి, ఏఈవోలు శ్రీ గోపీనాథ్, శ్రీ గంగాధరం, ఇతర అధికారులు, అన్న‌ప్ర‌సాద విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.