AYUDHA PUJA HELD AT ANNAPRASADA BHAVANAM _ తిరుమ‌ల అన్నప్రసాద భవనంలో ఘ‌నంగా ఆయుధపూజ

TIRUMALA, 11 NOVEMBER 2021: Ayudha Puja was performed at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) at Tirumala on Thursday.

 

Annaprasadam Deputy EO Sri Harindranath performed puja to the catering utensils and machinery. Later prasadam were distributed to the staff, srivari sevaks and pilgrims.

 

Deputy EO Reception Sri Lokanatham, PRO Dr T Ravi, VGO Sri Bali Reddy, AEO Sri Gopinath and other officials from the Annaprasadam department, staff members were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమ‌ల అన్నప్రసాద భవనంలో ఘ‌నంగా ఆయుధపూజ

తిరుమ‌ల‌, 2021 న‌వంబ‌రు 11: ప్రతినిత్యం వేలాదిమంది శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలు అందించే తిరుమల మాతృశ్రీ‌ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఉదయం ఘనంగా ఆయుధపూజ నిర్వహించారు.

అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ వంట సామగ్రికి, వంట పాత్రలకు, యంత్రాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సంవత్సరమంతా నిర్విఘ్నంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరగాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ పూజ కార్య‌ర‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో (రిసెప్షన్) శ్రీ లోకనాథం, పిఆర్వో డాక్టర్ టి. రవి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ గోపీనాథ్‌తో పాటు అన్నప్రసాద శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.