AYUDHA PUJA HELD IN TIRUPATI TRANSPORT _ రవాణా విభాగం లో వేడుకగా ఆయుధ పూజ

Tirupati, 14 October 2022: The Ayudha Puja was held in TTD Transport depot in Tirupati on Friday in a grand manner.

TTD EO Sri AV Dharma Reddy along with JEO Sri Veerabrahmam and CVSO Sri Narasimha Kishore took part in the Puja held to vehicles on the occasion.

Transport GM Sri Sesha Reddy, AMF Smt Lakshmi Prasanna, DIs Sri Mohan, Sri Subramanyam Raju, AEO Smt Sravanti, Superintendents Sri Dharmaiah, Sri Varaprasad other staff members, drivers were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రవాణా విభాగం లో వేడుకగా ఆయుధ పూజ

తిరుపతి 14 అక్టోబరు 2022: టీటీడీ రవాణా విభాగం లో శుక్రవారం ఆయుధపూజ వేడుకగా నిర్వహించారు . ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి , జేఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీర బ్రహ్మం , సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

ముందుగా ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఈవో కు ఆ విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు . అనంతరం వీరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయుధ పూజలో పాల్గొన్నారు .అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించిన అనంతరం జిఎం శ్రీ శేషారెడ్డి ఈవో , జేఈవో లు ,సివిఎస్వో ను శాలువాతో సత్కరించారు .

ఈ సందర్బంగా ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ , వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఉద్యోగులందరూ క్షేమంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ప్రతి ఏటా దీపావళి ముందు ఆయుధపూజ నిర్వహిస్తామన్నారు . ఇందులో భాగంగానే శుక్రవారం ఆయుధ పూజ చేశామని ఆయన తెలిపారు .

ట్రాన్స్ పోర్ట్ ఎ ఎం ఎఫ్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న , డి ఐ శ్రీ మోహన్ తో పాటు పలువురు అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది