AYUDHA PUJA PERFORMED _ తిరుమల రవాణా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ

TIRUMALA, 14 OCTOBER 2022: Ayudha Puja was performed in Tirumala Transport Depot on Friday evening.

TTD EO Sri AV Dharma Reddy participated in the Puja.

Transport GM Sri Sesha Reddy, DyEO Sri Harindranath, EE Surendranath Reddy, Health Officer Dr Sridevi, VGO Sri Bali Reddy, Reception OSD Sri Ramakrishna, DI Sri Janakirami Reddy, drivers, other staff were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల రవాణా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ
 
తిరుమల, 2022 అక్టోబర్ 14: టీటీడీ రవాణా శాఖ తిరుమల విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ శుక్రవారం స్థానిక వర్క్‌షాపులో ఘనంగా జరిగింది. టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా తిరుమలలోని వివిధ టీటీడీ వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.
 
రవాణా విభాగం జీఎం శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇఇ శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, వీజీఓ శ్రీ బాలిరెడ్డి, రిసెప్షన్ ఓఎస్డీ శ్రీరామకృష్ణ, డీఐ శ్రీ జానకిరామిరెడ్డి, డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.