AYURVEDA MEDICINE IS A SUB-WING OF ADHARVANA VEDA- DR PADMAVATHI, SV AYURVEDA RMO _ శ్రీవారి భక్తులకు ఆయుర్వేద వైద్యం : ఎస్.వి. ఆయుర్వేద కళాశాల రెసిడెన్స్ మెడికల్ అధికారి డా|| జి.పద్మావతి
Tirumala, 6 October 2019: As a part of the promotion of Sanatana Haindhava Dharma, TTD has set up SV Ayurvedic hospital and is providing free medicine to devotees said Dr. G Padmavathi, the RMO of SV Ayurvedic Medical college.
Speaking at the media center at Tirumala on Sunday, she said that Ayurveda is considered as an Upaveda of Adharvana Veda.
She said that nearly 6000 devotees received 16 types of Ayurveda medicine worth Rs.3 lakhs and nearly 100 devotees were treated at the special dispensary set up near the Lepakshi center at Tirumala during these seven days of Brahmotsavams so far.
She said the SV Ayurveda college comprising of 14 departments and is serving te devotees for the last 24 years and the Panchakarma medicine is also provided here.
The Doctor said, TTD has also published some books to bring awareness among locals on Ayurvedic medicine which includes Sri Venkateswara Vanamoolika Vignanam, Home Garden in Ayurveda.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి భక్తులకు ఆయుర్వేద వైద్యం : ఎస్.వి. ఆయుర్వేద కళాశాల రెసిడెన్స్ మెడికల్ అధికారి డా|| జి.పద్మావతి
తిరుమల, 2019 అక్టోబరు 06: శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన ఆయుర్వేద వైద్యం అందిస్తున్నామని ఎస్.వి ఆయుర్వేద వైద్యశాల రెసిడెన్స్ మెడికల్ అధికారి డా|| జి.పద్మావతి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో ఆదివారం ఎస్.వి. ఆయుర్వేద కళాశాల రెసిడెన్స్ మెడికల్ అధికారి డా|| జి.పద్మావతి, ఆయుర్వేదిక్ కళాశాల వైద్యాధికారి డా|| నారపరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాయ జి. పద్మావతి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టిటిడి అందిస్తున్న ఆయుర్వేద వైద్యానికి భక్తుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపారు. కల్యాణవేదిక చెంత ”బ్రహ్మోత్సవ మహా ప్రదర్శన” లో ఏర్పాటుచేసిన ఆయుర్వేద ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. ఇందులో ఔషధగుణాలున్న మొక్కలను, వాటిని ఏవిధంగా ఉపయోగించాలి, ఏ వ్యాధికి ఉపయోగించాలనే విషయాలను సవివరంగా వివరిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశామని వివరించారు.
అదే విధంగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీ వరహస్వామి అతిథి భవనం ప్రక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం, సిఆర్‌వో, లేపాక్షి దగ్గర ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాలలో ప్రతిరోజు దాదాపు 1000 మంది భక్తులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3 లక్షల విలువైన 16 రకాల మందులను 6,000 మంది భక్తులకు అందించామన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గత 24 సంవత్సరాలుగా భక్తులకు ఉచిత వైద్య కేంద్రాల ద్వారా ఆయుర్వేద మందులను పంపిణీ చేస్తున్నట్లు ఆయుర్వేదిక్ కళాశాల వైద్యాధికారి డా|| నారపరెడ్డి తెలియజేశారు. భారతీయ వేదాల నుండి ఉద్భవించిందే ఆయుర్వేదమని వివరించారు. శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేదిక్ కళాశాలలో 14 డిపార్టుమెంట్లలో షుగరు, బి.పి లాంటి దీర్ఘకాల రోగాలకు సంబంధించి ఆయుర్వేద మందుల ద్వారా నయం చేయడానికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా పంచకర్మ చికిత్స విధానం ద్వారా 5 రకాల మలినాలను శరీరం నుండి తొలగించేలా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ప్రజాసంబంధాల ఆధికారి డా|| టి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.