సనాతన ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాల వ్యాధులను నయం చేయవచ్చు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
సనాతన ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాల వ్యాధులను నయం చేయవచ్చు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
తిరుమల, 2017 అక్టోబరు 14: సనాతన వైద్యవిధానమైన ఆయుర్వేదానికి టిటిడి ఊతమిస్తోందని, పంచకర్మ ద్వారా దీర్ఘకాల రోగాలను శాశ్వతంగా నయం చేయవచ్చని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఉద్ఘాటించారు. తిరుపతిలోని ఎస్.వి.ఆయుర్వేద కళాశాలలో 6 రోజులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఆయుర్వేద వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమంలో భాగంగా ”పంచకర్మ”పై ప్రత్యేక శిక్షణ శనివారం ముగిసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ప్రజలలో ఆయుర్వేద వైద్యానికి విశేష ఆదరణ వుందన్నారు. వైద్యులకు నిరంతర వైద్య విద్యా శిక్షణ కార్యక్రమాల ద్వారా మరింత విశేషమైన సేవలందించవచ్చన్నారు. తిరుపతిలోని టిటిడి ఆయుర్వేద ఆసుపత్రిలో 200 మంది ఇన్‌పేషంట్లతో పాటు రోజుకు 100 నుంచి 200 వరకు రోగులకు వైద్యసేవలందిస్తున్నట్లు తెలిపారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుండి 30 మంది వైద్యులు హాజరుకాగా వీరిలో 21 మంది ప్రభుత్వ, 9 మంది ప్రైవేట్ ఆయుర్వేద వైద్యులున్నారు.
ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శంకర్ బాబు, హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి పార్వతి, వైప్ ప్రిన్సిపాల్ శ్రీ దత్తాత్రేయ, శ్రీ భాస్కర్‌రావు, కొఅర్డినేటర్ శ్రీ మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.