AYUDHA PUJA PERFORMED IN TTD PRINTING PRESS_ టిటిడి ప్రింటిగ్‌ ప్రెస్‌ సిబ్బందిని అభినందించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఘనంగా ఆయుధపూజ

Tirupati, 14 October 2017: Ayudha Puja was performed in TTD Printing Press on Saturday and Tirupati JEO Sri P Bhaskar took part in the event.

Speaking on this occasion, the JEO lauded the efforts of the activities of employees of printing press for bringing out books and book lets related to TTD Hindu Sanatana Dharma Prachara.

The JEO took part in the special puja performed to the printing machinery. DyEO Printing Press and TTD PRO Dr T Ravi, DyEO Smt Goutami, Sapthagiri Chief Editor Sri Radha Ramana were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

టిటిడి ప్రింటిగ్‌ ప్రెస్‌ సిబ్బందిని అభినందించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఘనంగా ఆయుధపూజ

తిరుపతి, 2017 అక్టోబరు 14: 2018 నూతన ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్లు, డైరీలు నాణ్యంగా ఉన్నాయని సిబ్బందిని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అభినందించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా గల ముద్రణాలయంలో శనివారం ఆయుధపూజను సిబ్బంది ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ 2018 సంవత్సరంకు సంబంధించి క్యాలెండర్లు, డైరీలు, శ్రీ వేంకటేశ్వరస్వామివారు, పద్మావతి అమ్మవారితో కూడిన క్యాలెండర్‌, శ్రీవారు మాత్రమే ఉన్న క్యాలెండర్‌, పంచాంగం క్యాలెండర్లకు డిసెంబర్‌ నెలలో అధిక డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి సమాచార కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. టిటిడి ధార్మిక కార్యక్రమాలు, గ్రంధాలు, ధర్మ ప్రచారానికి అవసరమైన ప్రచురణలను ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ముద్రించి రాబోవుతరాలకు అందిస్తున్నట్లు వివరించారు.

అంతకుముందు జెఈవో ముద్రాణాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పినింగ్‌ విషన్‌ను ప్రారంభించారు. అనంతరం అన్ని విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం శ్రీవారి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ గల డిటిపి, ఆఫ్‌సెట్‌, లెటర్‌ప్రెస్‌, బైండింగ్‌ విభాగాల్లోని యంత్రాలకు ఆయుధపూజ చేశారు.

టిటిడి ముద్రణాలయం డెప్యూటీ ఈవో మరియు టిటిడి పి.ఆర్‌.వో డా|| టి.రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, సప్తగిరి ముఖ్య సంపాదకులు శ్రీరాధ రమణ, అసిస్టెంట్‌ మేనేజర్లు శ్రీ ప్రభాకర్‌, శ్రీ నరసింహులు, శ్రీ ఈశ్వర్‌రెడ్డి, శ్రీ రవిచంద్ర, యూనియన్‌ నాయకులు శ్రీ ఎన్‌. శ్రీనివాసన్‌, శ్రీడి.శ్రీనివాసమూర్తి, శ్రీ వి.కె.శ్రీనివాసులు, అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.