AZADI KA AMRIT MAHOTSAV TO BE OBSERVED BY TTD IN A BIG WAY-EO _ టీటీడీలో పెద్ద ఎత్తున ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు

TIRUPATI, 12 AUGUST 2022: TTD will observe “Azadi ka Amrit Mahotsav” in a grand manner on August 15 taking a massive rally with its employees and students from the Administrative Building to Mahati Auditorium, said TTD EO Sri AV Dharma Reddy.

 

A review meeting with all the Heads of various departments in TTD was held at the Conference Hall in TTD Administrative Building in Tirupati on Friday by EO on the Amrit Mahotsav arrangements.

 

He said following the clarion call given by the Honourable Prime Minister of India Sri Narendra Modi to fly the Tricolour flag on every household on the auspicious occasion of the Platinum Jubilee of Independence Day celebrations, Azadi Ka Amrit Mahotsav will be observed in a grand manner by TTD in the Temple City.

 

As part of it, the EO said, every employee of TTD will fly the National flag upon his or her house and also take part in the rally which commences at the Administrative building and concludes at Mahati Auditorium.

 

He directed JEO (H & E) Smt Sada Bhargavi to circulate the guidelines given by the Central and State Governments to observe the National fete to every employee. 

 

He also directed the CVSO Sri Narasimha Kishore to coordinate with the district police and ensure that there is no traffic hitch en route the massive rally. He instructed all the HoDs to ensure that every employee takes part in the rally with White uniform wearing the badge of the Tricolour flag.

 

The EO also instructed TTD- run hospitals to participate and observe the Azadi Ka Amrit Mahotsav with patriotic fervour.

 

The JEO informed the EO that 1000 students from all the TTD educational institutions have also been selected for the rally. “A few students will wear the guise of National leaders and lead the rally with relevant patriotic slogans”, she added.

 

An AV with the display of 75 Freedom Fighters was also being contemplated to be displayed during the “At Home” to be hosted by the EO in Tirupati on the evening of August 15.

 

FACAO Sri Balaji, DLO Sri Reddeppa Reddy, GM Sri Sesha Reddy, Chiefs of TTD hospitals, Heads of various departments were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీలో పెద్ద ఎత్తున ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు

-. 15న టీటీడీ పరిపాలనా భవనం నుంచి మహతి ఆడిటోరియం వరకు ర్యాలీ

– ప్రతి ఉద్యోగి ఇంటిమీద జాతీయ జెండా ఎగురవేయాలి – ఈఓ

తిరుపతి 12 ఆగస్టు 2022: దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు టీటీడీ లో కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు .

టీటీడీ పరిపాలన భవనంలో శుక్రవారం ఈ అంశంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు . ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ , ఆగస్ట్ 15న టీటీడీ పరిపాలన భవనం నుంచి మహతి ఆడిటోరియం వరకు ఉద్యోగులు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు . 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యోగులందరూ తమ ఇళ్ళ పై త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్నారు .

పరిపాలనా భవనం వద్ద ప్రారంభమై మహతి ఆడిటోరియం వద్ద ముగిసే ర్యాలీలో ఉద్యోగులందరూ పాల్గొనాలన్నారు . జాతీయ ఉత్సవాలను నిర్వహించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రతి ఉద్యోగికి పంపిణీ చేయాలని ఆయన జెఈవో శ్రీమతి సదా భార్గవిని ఆదేశించారు.

జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకుని , భారీ ర్యాలీ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్‌ను ఈవో ఆదేశించారు. ప్రతి ఉద్యోగి త్రివర్ణ పతాకం బ్యాడ్జి ధరించి తెల్లటి యూనిఫారంతో ర్యాలీలో పాల్గొనేలా చూడాలని అన్ని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రులు కూడా భాగస్వాములు కావాలని ఆయన ఆదేశించారు.

టీటీడీ విద్యాసంస్థల నుంచి 1000 మంది విద్యార్థులను ర్యాలీకి ఎంపిక చేశామని జెఈవో ఈఓకు తెలిపారు. “కొంతమంది విద్యార్థులు జాతీయ నాయకుల వేషాలు ధరించి దేశభక్తి నినాదాలతో ర్యాలీని నడిపిస్తారు” అని ఆమె తెలిపారు.

75 మంది స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనతో కూడిన ఆడియో విజువల్ ను (ఎ వి ) ఆగస్టు 15 సాయంత్రం తిరుపతిలో ఈవో నిర్వహించనున్న “ఎట్ హోమ్” సందర్భంగా ప్రదర్శించనున్నారు .

ఎఫ్‌ఏసీఏవో శ్రీ బాలాజి ,డీఎల్‌వో శ్రీ రెడ్డెప్ప రెడ్డి, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది