JEO INSPECTS VAIBAVOTSAVAM ARRANGEMENTS AT NELLORE _ నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

Tirupati, 12 August 2022: TTD JEO Sri Veerabrahmam on Friday inspected the ongoing arrangements at Nellore city for conducting the holy Sri Venkateswara Vaibhavotsams slated from August 16-20.

 

He went round the AC Subba Reddy stadium, the Venue of the fete and reviewed the arrangements of serting up German sheds, Temple module, facilities for arjita sevas, potu (kitchen) and counters for preparation of Prasadam, counters for publications sale, photo exhibition on recent TTD programs, Gopuja arrangements, galleries in the venue, entry routes, public address systems, LED screens, electrical and flower decorations.

 

Similarly he also instructed officials to make arrangements for temporary toilets, drinking water systems, security CC cameras, vigilance control room, primary health centres, parking lots at venue.

 

He also directed officials to make arrangements for direct live telecast by SVBC and deployment of Srivari Sevaks to serve at the Vaibhavotsam fete.

 

CE Sri Nageswar Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, VGO Sri Manohar, DE Sri Ravi Shankar Reddy, EE Smt Sumati, PRO Dr T Ravi, Sales wing special officer Sri Ramraju, Deputy EE Sri Venkateswarlu, AE Sri Anjaneya Raju, Sri Penchal Reddy and Sri Vijay Kumar of VPR foundation were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2022, ఆగస్టు 12: టిటిడి ఆధ్వర్యంలో ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు నెల్లూరు నగరంలో నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ఏర్పాట్లను జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా నెల్లూరులోని ఎసి.సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న వేదిక పనులను జెఈఓ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వేదిక వద్ద ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్డు, నమూనా ఆలయం, సేవల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లు, ప్రసాదాల తయారీకి పోటు, ప్రసాదాల కౌంటర్లు, పుస్తక విక్రయ కౌంటర్, ఇటీవల టిటిడి చేపట్టిన కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్, గోపూజ ఏర్పాట్లు, ప్రాంగణంలో గ్యాలరీలు, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పిఎ సిస్టమ్, ఎల్ఇడి స్క్రీన్లు, విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా, పార్కింగ్ ప్రదేశాలు, సూచిక బోర్డులు, ప్రవేశ మార్గాల వద్ద ఆర్చిలు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలు, భద్రత కోసం సిసి కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్వామివారి సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని, భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని కోరారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జెఈఓ వెంట సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇలు శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్లు, విజిఓ శ్రీ మనోహర్, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, ఇఇ శ్రీమతి సుమతి, పిఆర్వో డా|| టి.రవి, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు, డెప్యూటీ ఇఇ శ్రీ వెంకటేశ్వర్లు, ఎఇ శ్రీ ఆంజనేయ రాజు, విపిఆర్ ఫౌండేషన్ కు చెందిన శ్రీ పెంచల్ రెడ్డి, శ్రీ విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.