AZADIKA AMRITA MAHOTSAV AT SV VEDIC UNIVERSITY _ ఎస్వీ వేద వర్సిటీలో ఆజాదీకా అమృత మహోత్సవ సదస్సు
Tirupati, 10 August 2022: Azadika Amrita Mahotsav was observed with gaiety at SV Vedic University on Wednesday upon the directives of the TTD EO and University Vice Chancellor Sri AV Dharma Reddy under the supervision of Registrar Dr Radheshyam.
Speaking on the occasion as chief guest, Acharya of the Sanskrit department at National Sanskrit University, Dr Chakravarti Ranganathan paid rich tributes to national leaders like Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru and others who provided Ramarajya to the nation. He also hailed contributions of Swami Vivekananda who the spread message of Vedic knowledge across the globe.
Among others, Dr Subramaniam Bhide, Dr Rajesh Kumar, Dr Neelakantan, Sri Ganjam Ramakrishna, Dr Purushottam Acharya Dr AV Radheshyam, Dr P Ramakrishna Somayaji spoke on various highlights of the freedom struggle and sacrifices of national and regional leaders.
Academic Dean Dr Phani Yajneswarayajulu, coordinator Dr K Purushottam Acharya, PRO Dr T Brahmacharya were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ వేద వర్సిటీలో ఆజాదీకా అమృత మహోత్సవ సదస్సు
తిరుపతి, 2022 ఆగస్టు 10: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో బుధవారం ఆజాదీకా అమృత మహోత్సవ సదస్సు నిర్వహించారు. వర్సిటీ ఉపకులపతి మరియు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు కులసచివులు శ్రీ డా.ఎవి.రాధేశ్యామ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సాహిత్య విభాగం ఆచార్యులు డా. చక్రవర్తి రంగనాథ్ ఆర్షవాంగ్మయంలో రాష్ట్ర భావన అనే అంశంపై ఉపన్యసించారు. జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ లాంటివారు శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని పాలన అందించారని తెలిపారు. ఇలాంటి నాయకులను అమృతోత్సవాల సమయంలో స్మరించుకోవాలని కోరారు. స్వామి వివేకానంద లాంటి మహనీయులు వేదాలను ఆధారంగా తీసుకొని దేశ ప్రతిష్టను ఇనుమడించేలా ప్రసంగాలు చేశారని, యువత వారి మార్గంలో నడవాలని కోరారు.
ఈ సందర్భంగా డా. సుబ్రహ్మణ్యంబిడే, డా.రాజేష్ కుమార్, కుమార్, డా.నీలకంఠం, శ్రీ గంజాం రామకృష్ణ, డా.కె. పురుషోత్తమాచార్యులు, డా.ఎవి.రాధేశ్యామ్, డా.ప్రవా రామకృష్ణ సోమయాజి వివిధ అంశాలపై ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ డా.ఫణియజ్ఞేశ్వరయాజులు, సమన్వయకర్త డా. కె.పురుషోత్తమాచార్యులు, పిఆర్వో డా.టి. బ్రహ్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.