BABU JAGJIVAN RAM JAYANTHI OBSERVED IN TTD_ డా|| బాబు జగజ్జీవన్‌రామ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి – ఆయన ఆశయసాధనే నిజమైన నివాళి : టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 05 Apr 2018: The 111th Birth Anniversary of Dr Babu Jagjivan Ram was observed with fervour in TTD administrative building on Thursday.
Speaking on the occasion, TTD EO Sri Anil Kumar Singhal said, Babu Jagjivan Ram fought for the equality of underprivileged classes. In 1946, he became the youngest minister in Jawaharlal Nehru’s provisional government and also the subsequent First Indian Cabinet, as a Labour Minister, where he is credited for several labour welfare policies in India.
The EO said, Sri Babu Jagjivan made his mark in every field he served as Minister of Tele Communications, Transport and Railways, and Transport and Communications while in Indira Gandhi’s government, as minister for Labour, Employment, and Rehabilitation and Union Minister for Food and Agriculture where he is best remembered for having successfully led the Green Revolution during his tenure. It was during his tenure as the Minister of Defence that the Indo-Pakistani War of 1971 was fought, and Bangladesh gained independence”, he remembered.
The EO further said, following the principle of equality, many SC, ST employees are given promotion in TTD as per rules. “TTD has also taken up construction of temples in SC, ST colonies. An amount of Rs.25cr is allotted to Samarasata Foundation and also we are giving training to SCs and fishermen community in priesthood”, he maintained.
Tirupati JEO Sri P Bhaskar said, the Birth Anniversary of Dr Babu Jagjivan Ram is being observed as Samatha Divas. He recalled him as one of the most powerful Socio-political reformers in the country.
Later Dr P Varalakshmi, Telugu lecturer in Government Degree and PG College, Puttur recalled the achievements of Sri Jagjivan Ram while Sri K Srinivasulu, Chairman Dr Bhimrao Educational Development Charitable Trust elaborated on the caste discrimination he faced during his childhood and how he overcome all the disparities and proved himself not just individual but as a socio-political force.
TTD Publications Special Officer Sri Anjaneyulu, DyEOs Sri Chengalrayalu, Sri Subramanyam, Sri Devender Babu, Smt Kasturi, Smt Snehalatha were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
డా|| బాబు జగజ్జీవన్‌రామ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి – ఆయన ఆశయసాధనే నిజమైన నివాళి : టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్
తిరుపతి, 2018 ఏప్రిల్ 05: సమసమాజ స్థాపన కోసం పాటు పడిన డా|| బాబు జగజ్జీవన్‌రామ్ జీవితాన్ని ప్రతి ఒకరు ఆదర్శంగా తీసుకుని, వారి ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్ కోరారు. డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 111వ జయంతి వేడుకలను టిటిడి పరిపాలనా భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నిమ్నకులంలో జన్మించిన బాబు జగజ్జీవన్‌రామ్ డబ్బు లేకపోయినా, కులవివక్ష ఎదురైనా వాటిని అధిగమించారని, కష్టపడి చదువుకుని సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఎదిగి భారత ఉప ప్రధాని పదవిని అలంకరించారని తెలియజేశారు. భారత రాజకీయాలలో క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీతో వివిధ మంత్రి పదవులకు వన్నెతెచ్చి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, అటుతరువాత సమాజంలో సమస్యలను అధ్యయనంచేసి, వాటి పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్రానంతరం మొదటి కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల అభ్యున్నతి కోసం పలు చట్టాలు తీసుకువచ్చారన్నారు.
అదేవిధంగా టిటిడి ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, అరకు, రంపచోడవరం ప్రాంతాలలో కళ్యాణమండపాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా ఎస్సి, ఎస్టీ, బిసి, మత్స్యకార కాలనీలలోని స్థానికులకు తిరుపతిలోని శ్వేతా భవనంలో శిక్షణ ఇచ్చి అర్చకులుగా నియమిస్తున్నామన్నారు.
బాబు జగజ్జీవన్‌రామ్ ఆశయాలకు అనుగుణంగా టిటిడిలో సమన్యాయం పాటస్త్తూ, నిబంధనలకు అనుగుణంగా ఎస్సి, ఎస్టీ సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వివరించారు. ఇలాంటి నాయకుల జయంతి, వర్ధంతి సభల ద్వారా వారు చేసిన మంచి పనులు తెలుసుకుని, ఆ మార్గంలో నడిచేందుకు స్ఫూర్తి పొందాలన్నారు, శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలందించాలని ఆయన కోరారు.
అనంతరం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్‌రామ్ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ, నిబద్ధతతో సమస్యలపై పోరాడి అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచి, ఆచరించి చూపిన గొప్ప మానవతావాది అని అన్నారు. ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న సవ్యశాచిగా వ్యవహరించారని తెలిపారు. స్వాత్రంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని, స్వాతంత్య్రానంతరం ఆ ఫలాలు అందరికి అందేలా ఆయన కృషి చేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా విచ్చేసిన పుత్తూరులోని ప్రభుత్వ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డా|| వరలక్ష్మీ ప్రసంగిస్తూ తండ్రి శోభిరామ్ నుంచే జగ్జీవన్‌రామ్‌కు సేవాభావం అలవడిందని తెలిపారు. చిన్నతనం నుండి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎదుర్కొని నిలబడ్డారని, ప్రశ్నించేతత్వం ఆయన్ను నాయకునిగా తీర్చిదిద్దిందని అన్నారు. సమసమాజ నిర్మాణం కోసం తనను తాను సంస్కరించుకుని సమాజాన్ని సమస్కరించిన గొప్పవ్యక్తి అని వివరించారు.
అంతకుముందు టిటిడి ఈవో, తిరుపతి జెఈవోలు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగజ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారిణి కుమారి పి.నీలిమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్, ఉప కార్యనిర్వహణాధికారులు శ్రీమతి స్నేహలత, శ్రీసుబ్రమణ్యం, శ్రీమతి కస్తూరి, శ్రీ దేవేంద్రబాబు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.