BHASHYAKARLA SATTUMORA ON APRIL 21_ ఏప్రిల్‌ 21న తిరుమలలో భాష్యకారుల సాత్తుమొర

Tirumala, 5 April 2018: Bhashyakarla Sattumora will be observed in Tirumala temple on April 21.

Saint Ramanujacharya penned “Sri Bhashyam”, a famous mimamsa literature and became famous as ‘Bhashyakarulavaru’.

Bhashyakarula utsavam will be observed for 19 days starting from April 19 to 30. On April 21, Sattumora will be observed. On this auspicious day, Lord along with his consorts Sri Devi, Bhudevi, accompanied by Bhashyakarula varu takes round along four mada streets in the evening after Sahasra Deepalankara and enters temple.

Tirumala Pedda Jiyangar, Chinna Jiyangar swamijis and other officials takes part in this fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 21న తిరుమలలో భాష్యకారుల సాత్తుమొర

ఏప్రిల్‌ 05, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 21వ తేదీన భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధిచెందారు. శ్రీ రామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భగవద్‌ రామానుజులు దేశమంతటా సంచరించి శ్రీవైష్ణవతత్వాన్ని పరిపుష్టం చేస్తూ ప్రచారం చేశారు. అగ్రవర్ణాలవారికి మాత్రమే గాక అట్టడుగున ఉన్న నిమ్నజాతులవారికి కూడా వైష్ణవమతాన్ని స్వీకరించేందుకు అవకాశం కల్పించారు. దేశంలోని అనేక శ్రీవైష్ణవక్షేత్రాల జీర్ణోద్ధరణ, అభివ ద్ధి చేయడంతోపాటు ఆలయ పూజాది కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

భాష్యకార్ల ఉత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 12 నుండి 30వ తేదీ వరకు 19 రోజులపాటు రోజుకొకరు చొప్పున ఉభయం సమర్పిస్తారు. మొదటి రోజు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ మఠం నుండి, రెండో రోజు శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ మఠం నుంచి ఉభయం అందుతుంది. ఆ తరువాత ఏకాంగి, మేళం స్టాఫ్‌, అధ్యాపకులు, పార్‌పత్తేదార్‌ తదితరులు ఉభయం సమర్పిస్తారు. చివరిరోజు శ్రీహథీరాంజీ మఠం నుండి ఉభయం అందిస్తారు.

శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా ఏప్రిల్‌ 21వ తేదీన సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వసంతోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.