BABU JAGJIVAN RAM JAYANTI OBSERVED _ డా|| బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి : ఆచార్య గాలి వినోద్ కుమార్

TIRUPATI, 05 APRIL 2023: The 116th Birth Anniversary of Sri  Baby Jagjivanram was observed with utmost ecstasy on Wednesday under the Welfare Department of TTD at Mahati Auditorium in Tirupati.

 

Speaking on the occasion, Faculty of Law Dean Prof Gali Vinod Kumar of Usmania University from Hyderabad said, Dr Babu Jagjivanram, fought against all social odds in his life and with ease performed all his responsibilities in his 52 years of political career.

 

DyEOs Smt Snehalata, Sri Anandaraju, Smt Jagadeeshwari, EE Manoharam and other employees participated.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డా|| బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి : ఆచార్య గాలి వినోద్ కుమార్
 
తిరుపతి, 2023 ఏప్రిల్ 05: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దేశానికి ఉప ప్రధానిగా ఎదిగిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక అంత‌రాల‌ను తొల‌గించేందుకు ఎంత‌గానో కృషి చేశార‌ని, వారి అడుగుజాడ‌ల్లో అంద‌రం న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని హైదరాబాద్ లోని ఉస్మానియా వర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ ఆచార్య గాలి వినోద్ కుమార్ కోరారు. జ‌గ్జీవన్‌రామ్ 116వ జయంతి వేడుకలను తిరుపతిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆచార్య గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ 52 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌ర‌త‌మ భేదాలు లేకుండా అంద‌రికీ విశేషంగా సేవ‌లందించిన అజాత‌శ‌త్రువు శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ అన్నారు. పాఠ‌శాల వ‌య‌సులోనే రెండు కుండ‌ల విధానాన్ని వ్య‌తిరేకించార‌ని, రిజ‌ర్వేష‌న్‌లో వ‌చ్చే స్కాల‌ర్‌షిప్ కాద‌ని మెరిట్ స్కాల‌ర్‌షిప్ పొందిన మేధావి అని కొనియాడారు. కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిగా దేశంలో హ‌రిత విప్ల‌వం తీసుకొచ్చి దిగుబ‌డులు పెంచిన ఘ‌నత వారికే ద‌క్కుతుంద‌న్నారు.
 
 అదేవిధంగా హైదరాబాద్ లోని ప్రభుత్వ సిటి కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా. కోయి కోటేశ్వరరావు, తిరుపతి క్రైమ్ సిఐ శ్రీమతి పి.సుమతి ప్రసంగించారు.
 
అంతకుముందు టిటిడి అధికారులు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా విశేష సేవ‌లందించిన ప‌లువురికి జ్ఞాపిక‌లు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. కార్య‌క్ర‌మం మొద‌ట్లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కళాకారుడు డా.ఎం.భిక్షు నాయక్ బృందం  ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.
 
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీ ఆనంద‌రాజు, శ్రీమతి జగదీశ్వరి, ఇఇ శ్రీ మ‌నోహ‌రం ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.