JEO INSPECTS ARRANGEMENTS AT VONTIMITTA _ కల్యాణానికి విచ్చేసే భక్తుల ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో

VONTIMITTA, 05 APRIL 2023:  TTD JEO Sri Veerabrahmam on Wednesday inspected the arrangements at Vontimitta Sri Kodandaramalayam in connection with Sri Sita Rama Kalyanam.

 

As part of it, he inspected Annaprasadam packing, Annaprasadam serving, Prasadam bags packing etc. by Srivari Sevakulu at Kalyana Vedika as well at Annaprasada Centre arranged besides the centre.

 

A total of 2500 Srivari Sevakulu have been rendering impeccable services. Especially on Wednesday, braving the scorching temperatures, the sevaks were involved in packing, lifting and distribution of Annaprasadam and sacred prasadam bags.

 

CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and other officials were present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్యాణానికి విచ్చేసే భక్తుల ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో

ఒంటిమిట్ట, 05 ఏప్రిల్ 2023: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను జేఈవో శ్రీ వీరబ్రహ్మం పరిశీలించారు.

ఆలయం ఎదుట టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ వైట్ రైస్, వెజిటబుల్ పలావు, చట్ని, కేసరి, రసం, సాంబారు, పప్పు, వెజిటబుల్ కర్రీ భక్తులకు వడ్డిస్తున్నారు. పలువురు భక్తులను పలకరించి అన్నప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ టీటీడీ పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కళ్యాణ వేదిక దగ్గర భక్తులకు పంపిణీ చేసేందుకు పులిహోర ప్యాకెట్ల తయారీని పరిశీలించారు. కళ్యాణానికి విచ్చేసే భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, కుంకుమ, కంకణం, 2 చిన్నలడ్డూ ప్రసాదం, పులిహోర, వాటర్ బాటిల్ కలిపి తయారు చేసిన కిట్లను పరిశీలించారు. గ్యాలరీలోకి ప్రవేశించే ముందే భక్తులకు ఈ ప్రసాదం కిట్లను అందజేయాలని అధికారులకు సూచించారు.

జేఈవో వెంట టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, విద్యుత్ విభాగం ఎస్ ఇ శ్రీ వెంకటేశ్వర్లు, డిఇ శ్రీ చంద్రశేఖర్, ఇఇ శ్రీమతి సుమతి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి,విజీవో శ్రీమనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ తదితరులు ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.