BALALAYA ASTABANDHANA RITUALS COMMENCES _ అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

Tirupati, 21 Nov. 20: The Astabandhana Balalaya Mahasamprokshana rituals commenced in the ancient and famous Sri Lakshmi Narayanaswamy temple at Alipiri on Saturday and this will conclude on November 25.

As part of this ritual, Punyahavachanam, Panchagavyaradhana, Vastuhomam, Rakshabandhanam, Vaidika programmes were held between 9am and 11.30am. In the evening, Agni Pratista, Kalavahana, Uksha Homams will be organised.

Vaikhanasa Agama Advisor Sri Sundaravaradan, Kankana Bhattar Sri Murali Krishna Acharyulu, Spl.Gr.Dy.EO Sri Rajendrudu, Temple Inspector Sri Srinivasulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

తిరుప‌తి, 2020 న‌వంబ‌రు 21: తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు శ‌నివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. న‌వంబ‌రు 25వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం,  వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వ‌ర‌కు యాగ‌శాల‌లో అగ్రి ప్ర‌తిష్ట‌, కల‌వాహ‌ణ, ఉక్త హోమాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గ‌జేంద్రుడు‌, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ సుంద‌ర‌వ‌ర‌ద భ‌ట్టాచార్యులు, కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ ముర‌ళి కృష్ణ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.