BALALAYAM BEGINS IN SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ”బాలాలయం”

Tirupati, 11 December 2017: The traditional ritual of Balalayam- rite to cleanse and rejuvenate the sanctum of all temples- in the complex of Sri Govindaraja Swamy Temple commenced today with Suprabatham, Thirumanjanam, Tomala Seva, and Archana. After the Raksha bandhanam for rutwiks (archakas), other events of the program shifted to Yagashala. Tonight all the pooja vessels, utsava idols of deity and family would be shifted to Yagashala for taking up rejuvenation works in the temple complex.

All arjita sevas and archanas besides darshan is suspended in the Sri GT from December 12 to 14. But the darshan in all other sub temples of the Sri GT- Sri Devi, Bhudevi, Kalyana Venkateswaraswamy, Rukmini-Sathyabhama with Parthasarathy, Andal Ammavaru, and Sri Pundarikavalli – will continue as routine. In view of the temple rejuvenation works for three months there will not be any darshan in the sanctum of GT.

Among others chief priest of Sri GT Sri Srinivasa Dikshitulu, DyEO Smt P Varalakshmi, Superintendent Sri Jnana Prakash, Temple inspector Sri Krishnamurthy and others participated in the program.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ”బాలాలయం”

డిసెంబరు 11, తిరుపతి, 2017: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయం కార్యక్రమాలు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు విశ్వరూప సర్వదర్శనం కల్పించారు. ఆ తరువాత ఉత్తర తిరుమంజనం, తోమాలసేవ, అర్చన చేపట్టారు. రుత్వికులకు రక్షాబంధనం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. రాత్రి శ్రీగోవిందరాజస్వామివారి సన్నిధి, ఇతర ఉప ఆలయాల్లో కళాకర్షణం చేపడతారు. కుంభాలు, ఉత్సవమూర్తులు, పరివార దేవతామూర్తులను ఊరేగింపుగా యాగశాలకు వేంచేపు చేస్తారు.

డిసెంబరు 12 నుంచి 14వ తేదీ వరకు శ్రీగోవిందరాజస్వామివారి దర్శనం రద్దు :

ఆలయంలో బాలాలయం కార్యక్రమాల కారణంగా డిసెంబరు 12 నుంచి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి మూలమూర్తి దర్శనాన్ని టిటిడి రద్దు చేసింది. ఉప ఆలయాలైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారి ఆలయం, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శ్రీ పుండరీకవళ్లి ఆలయాల్లో యథావిధిగా దర్శనం ఉంటుంది.

డిసెంబరు 15వ తేదీన మహాసంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఆలయంలోని కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో శ్రీ గోవిందరాజస్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. జీర్ణోద్ధరణ పనుల కారణంగా సుమారు మూడు నెలల పాటు గర్భాలయంలో మూలమూర్తి దర్శనం ఉండదు. బాలాలయంలోని శ్రీ గోవిందరాజస్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకృష్ణమూర్తి ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.