BALALAYAM FETE BEGINS AT SRI GT _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బాలాల‌య కార్యక్రమాలు ప్రారంభం

Tirupati, 09 September 2021: The five day long Balalayam festivities commenced at Sri Govindarajaswami temple on Thursday morning ahead of the proposed gold plating works of the temple vimanam on Thursday.

As part of celebrations, the Idols of  Swami and ammavaru were placed in the temple Kalyana Mandapam for daily rituals to facilitate the goldwork of vimana lasting till May 2022 starting from September 14 this year.

On the first day of the balalayam, several vaidika programs were performed at the yagashala both in the morning and evening.

Special grade DyEO Sri Rajendrudu, VSO Sri Manohar, temple chief Archaka Sri P Srinivasa Dikshitulu, Agama adviser Sri Vedantam Vishnu Bhattacharya AEO Sri M Ravikumar Reddy, superintendent Sri A Narayana, temple inspector Sri A Kamraju were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బాలాల‌య కార్యక్రమాలు ప్రారంభం
 
తిరుప‌తి, 2021 సెప్టెంబ‌రు 09: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో  విమాన గోపురానికి రాగి రేకుల‌పై బంగారు తాప‌డం ప‌నులు చేప‌ట్టనున్న నేపథ్యంలో బాలాల‌య కార్యక్రమాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబ‌రు 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.
 
ఇందుకోసం ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆల‌య విమాన గోపురానికి బంగారు తాప‌డం ప‌నులు సెప్టెంబ‌రు 14 నుండి 2022 మే నెల వ‌ర‌కు జ‌రుగుతాయి. అప్ప‌టి వ‌ర‌కు భ‌క్తుల‌కు య‌ధావిధిగా మూల‌మూర్తి ద‌ర్శ‌నం ఉంటుంది.
 
బాలాలయ కార్యక్రమాల్లో మొదటి రోజైన గురువారం ఉద‌యం అక‌ల్మ‌ష హోమం, పంచగవ్య ప్రాసనం, ఋత్వికులకు ర‌క్షాబంధ‌నం నిర్వహించారు. సాయంత్రం కుంభ‌స్థాప‌న చేసి స‌న్నిధి నుంచి శ్రీ గోవింద‌రాజ‌స్వామి, స్వామివారి విమానం, విష్వ‌క్సేనులు, జ‌య‌, విజ‌య‌, గ‌రుడ‌, ధ్వ‌జ‌స్తంభం, బ‌లిపీఠం కుంభాల‌ను యాగశాల‌కు తీసుకొచ్చి వైదిక కార్య‌క్ర‌మాలు చేపడతారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో శ్రీ ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.