BALALAYAM IN APPALAYAGUNTA ON AUGUST 5 AND 6_ ఆగస్టు 5, 6వ తేదీల్లో అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ

Tirupati, 29 July 2018: Astabandhana Balalaya Maha Samprokshanam will be observed in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta on August 5 and 6 with Ankurarpanam on August 4.

On August 5, Vastusuddhi, Jaladhivasasuddhi will be performed in the morning while in the evening Mahashanti Japyam, Mahashanti Tirumanjanam, Raksha Bandhanam, Sayanadhivasam, Sarva Devatarchana will be performed.

While on August 6, Purnahuti was performed at 9am followed by Kumba Bimba Pradakshina, Akshataropana, Brahmagosha and other vedic rituals.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 5, 6వ తేదీల్లో అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ

తిరుపతి, 2018 జూలై 29: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 5, 6 తేదీల్లో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగనుంది. ఆగస్టు 4వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహిస్తారు.

ఆగస్టు 5న ఉదయం వాస్తుశుద్ధి, జలాధివాస శుద్ధి చేస్తారు. సాయంత్రం మహాశాంతి జప్యం, మహాశాంతి తిరుమంజనం, రక్షాబంధనం, శయనాధివాసం, సర్వదేవతార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 6న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ఆ తరువాత కుంభ బింబ ప్రదక్షిణ, అక్షతారోపణ, బ్రహ్మ ఘోష చేపడతారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.