CHATURMASA VRATAM FOR THE SAKE OF WELLBEING OF HUMANITY-PONTIFFS_ తిరుమలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ చాతుర్మాస దీక్ష సంకల్పం

Tirumala, 29 July 2018: The pontiffs of Tirumala, HH Tirumala Sri Pedda Jiyangar Swamy and HH Sri Chinna Jiyar Swamy commenced Chaturmasya Vrata Deeksha after having darshan of Lord Venkateswara on Sunday.

Earlier following the temple tradition, the seers had darshan of Lord Sri Varaha Swamy and Swamy Pushkarini. On their arrival at Mahadwaram, they were given temple honours by veda pundits and received by TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju.

After darshan speaking to media outside the temple, EO said, Chaturmasya Vrata Deeksha is being observed every year by seers of Tirumala for the welfare of the mankind. “This will last for four months and they observe Japa, Tapa, Dhyana with utmost devotion and dedication”, he added.

On Chaturmasya Vrata Deeksha the seers said, the deeksha is in vogue as per the tradition of Sri Ramanujacharya Parampara. We have been continuing it for the welfare of the humanity”, they added.

Elaborating further on Astabandhana Balalaya Maha Samprokshanam, the seers of Tirumala said that this religious fete is observed once in every 12 years for the longevity of the presiding deity and seeking the prosperity of the universe. We have successfully carried ot out in 1982,1994,2006 and will be observed in the same manner this year also”, they asserted.

Chief Priest Sri Venugopala Deekshitulu, Temple DyEO Sri Harindranath, VGO Sri Ravindra Reddy, Peishkar Sri Ramesh were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ చాతుర్మాస దీక్ష సంకల్పం

జూలై 29, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుందని వివరించారు.

శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో 1982, 1994, 2006లో నిర్వహంచిన విధంగానే స్వామివారి వైదిక కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా శాస్త్రోకంగా నిర్వహిస్తామన్నారు.

అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారన్నారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

అంతకుముందు శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.

శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీచిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు.

అనంతరం శ్రీపెద్దజీయర్‌ మఠంలో శ్రీ పెద్దజీయంగార్‌, శ్రీ చిన్నజీయంగార్‌ కలిసి టిటిడి ఈవో, తిరుమల జెఈవోను శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పేష్కార్‌ శ్రీ రమేష్‌ బాబు, బొక్కసం బాధ్యులు శ్రీగురురాజారావు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.