BALALAYAM RITUALS COMMENCES AT SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో రుత్విక్‌వరణంతో ”బాలాలయం” కార్యక్రమాలు ప్రారంభం

Tirupati, 10 December 2017: The unique and hoary Balalayam ritual aimed at renovation of the sanctums of all temples in the Sri Govindaraja Swamy Temple complex commenced today with the Rithiwikavaranam rites. The once in 12 year ritual is taken up at sanctum of Sri Govindaraja Swamy, Anjaneyaswamy, Tirumala Nambi, Bhashyakarlu, Koorthalwar, Madhurakavi Alwar, Modaliayandan shrines in the Sri GT complex from Dec 11 to 15.

TTD EO Sri Anil Kumar Singhal and Tirupati JEO Sri Pola Bhaskar participated in the morning Ruthikavaram and presented Vastra danam to rutwiks (archakas). Later he said that the rites are performed once in 12 years to ensure incident free performance of all day to day rituals at the temple beginning with special events at the Yagashala from Dec 11-14 and the Mahasamprokshanam during Makara lagnam between 10am-10-30am on December 15, indicating the conclusion of the Balalayam.

Among others TTD Agama adviser Sri NAK Sundara Varadan, Temple Chief Priest Sri Sinivasa Dikshitulu, DyEO Smt P Varalakshmi, Srivari temple OSD Sri Pala Sheshadri, Bokkasam Superintendent Sri Gururaja Rao. AVSO Sri Gangaraju, Temple Superintendent Sri Gyana Prakash, Temple Superintendent Sri Krishnamurthi and other officials participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో రుత్విక్‌వరణంతో ”బాలాలయం” కార్యక్రమాలు ప్రారంభం

డిసెంబరు 10, తిరుపతి, 2017: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం రుత్విక్‌ వరణంతో బాలాలయం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రీగోవిందరాజస్వామివారి సన్నిధి, ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయం, తిరుమలనంబి, భాష్యకార్లు, కూరత్తాళ్వార్‌, మధురకవి ఆళ్వార్‌, మొదలియాండన్‌ సన్నిధుల్లో గర్భాలయ జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు బాలాలయం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఉదయం జరిగిన రుత్విక్‌వరణం కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పాల్గొని రుత్వికులకు వస్త్రప్రదానం చేశారు. అంతకుముందు రుత్వికులకు స్థాన నిర్ణయం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కైంకర్యాలు నిర్వహించేందుకు 12 సంవత్సరాలకోసారి బాలాలయం నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో డిసెంబరు 11 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. డిసెంబరు 15న ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య మకరలగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

కాగా, ఆదివారం ఉదయం శ్రీ ఎదురు ఆంజనేయస్వామివారి మూలవర్లకు తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం ఉభయనాంచారులతో కూడిన శ్రీగోవిందరాజస్వామివారికి, శ్రీఆంజనేయస్వామివారికి సమర్పణ, ఆస్థానం చేపట్టారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లు, శ్రీ ఆంజనేయస్వామివారి ఊరేగింపు, సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు మృత్సంగ్రహణం, యాగశాలలో అంకురార్పణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆగమసలహాదారులు శ్రీ ఎన్‌ఏకె.సుందరవరదన్‌, ఆలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మి, తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీ గురురాజారావు, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకృష్ణమూర్తి ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.