GRAND SPECIAL ABHISHEKAM OF BEDI ANJANEYA SWAMY_ ఘనంగా శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం

Tirumala, 10 December 2017: As per traditional custom of last Sunday of Karthika month special Abhisekam was performed at the Sri Bedi Anjaneyaswami temple this morning.

Legends speak of significance of Anjaneya in the glory of Lord Venkateswara during Kaliyuga as in the other eras.

Among others DyEO of Srivari Temple Sri Kodandarama Rao, Peishkar Sri Ramesh Babu and Sri Ashok participated in the event

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం

డిసెంబరు 10, తిరుమల 2017: తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా గల శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసం చివరి ఆదివారం ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 9 నుంచి 10 గంటల నడుమ విశేషంగా అభిషేకం చేశారు.

పురాణాల ప్రకారం తిరుమలలోని శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు ఎంతో బలవంతుడు, అంతకుమించి పరమభక్తుడు. త్రేతాయుగంలో శ్రీరామావతారంలో శ్రీమన్నారాయణునికి సేవకుడిగా, స్నేహితుడిగా, భక్తుడికి దాస్యభక్తిని చాటాడు. ప్రస్తుతం కలియుగంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల పూజలందుకుంటున్నాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ కోదండరామారావు, పేష్కార్లు శ్రీ రమేష్ బాబు, శ్రీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.