CULTURAL MELA IN BRAHMOTSAVAM _ 2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు _ శ్రీవారి బ్రహ్మోత్సవాల‌కు ఆధ్యాత్మిక‌ శోభ

TIRUMALA, 03 oct 2022: The devotional cultural events on the stages of Nada Neerajanam, and Asthana Mandapam apart from four Mada streets have been immensely attracting the devotees.

Starting with Mangaladhwani, Vishnu Sahasranama Parayanam, Annamaiah Vinnapalu and the various forms of displays and dances in Infront of Vahanams have remained a special attraction even on Monday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల‌కు ఆధ్యాత్మిక‌ శోభ

తిరుమల, 2022 అక్టోబ‌రు 03 ;శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య‌ కళాశాలకు చెందిన శ్రీమ‌తి కె.ర‌విప్ర‌భ బృందం మంగళధ్వని కార్య‌క్ర‌మం జరిగింది. తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి ప్ర‌స‌న్న‌ల‌క్ష్మి బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు గురువాయూర్‌కు చెందిన శ్రీ మ‌ణికంధ‌న్ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ జి.మ‌ధుసూద‌న‌రావు బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు సంగీత కార్య‌క్ర‌మం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీమ‌తి కృష్ణ‌కుమారి బృందం హరికథ పారాయణం చేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.