BARBERS CAUTIONED TO AVOID INFECTIONS – DR KRISHNA PRASHANTI _ క్షురకులు ఇన్ఫెక్షన్లు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి : డాక్టర్ కృష్ణప్రశాంతి
* AWARENESS SESSION AT ASTHANA MANDAPAM
Tirumala, 28 February 2023: Eminent Diabetologist, Dr Krishna Prashanti advised barbers of Kalyana Katta to take all precautions to avoid infections to devotees who offer tonsure ahead of Srivari Darshan.
Addressing a health awareness program at Asthana Mandapam in Tirumala on Tuesday to kalyana katta barbers Dr Krishna Prashanti said barbers should wear masks and frequently clean their hands with lotions to avoid nose, hair and lung infections to devotees.
Among others, she advised barbers on walking and do neck, shoulders exercises every hour since they were seated for long hours as a part of their work.
SVETA Director Smt Prashanti, AEO Kalyanakatta Sri Ramakanth Rao, 300 barbers were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
క్షురకులు ఇన్ఫెక్షన్లు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి : డాక్టర్ కృష్ణప్రశాంతి
– ఆస్థాన మండపంలో అవగాహన సదస్సు
తిరుమల, 28 ఫిబ్రవరి 2023: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తలనీలాలు తీసే క్షురకులు ఇన్ఫెక్షన్లు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని తిరుపతికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కృష్ణప్రశాంతి సూచించారు. తిరుమల ఆస్థాన మండపంలో మంగళవారం కళ్యాణకట్ట క్షురకులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణప్రశాంతి మాట్లాడుతూ క్షురకులు భక్తులకు చాలా దగ్గరగా ఉండి సేవలందిస్తారని, కావున మాస్కులు ధరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, వెంట్రుకలు, ముక్కు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని నివారించేందుకు లోషన్ తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని, చేతులకు తడి లేకుండా చూసుకోవాలని సూచించారు. ఎక్కువసేపు కూర్చొని పని చేయాల్సి రావడం వల్ల మోకాలి నొప్పి, నడుము నొప్పి రాకుండా గంటకోసారి ఐదు నిమిషాలు లేచి నడవాలని చెప్పారు. విధులు ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ మెడ, భుజాలకు సంబంధించిన వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం పలువురు క్షురకులు అడిగిన అనారోగ్య సమస్యలకు పరిష్కారాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ రమాకాంతరావు, 300 మందికి పైగా కళ్యాణకట్ట క్షురకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.