BHA-RA-TAM SINGNIFIES BHAVA RAGA TALAM-HDPP _ నాదోపాసన శ్రీవారికి ప్రీతికరం : హెచ్ డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్
Tirupati, 5 March 2020: Bharat is derived from Bhava Raga Talam and hence India is a land of fine arts, said, HDPP Secretary Prof.C Rajagopalan.
Addressing the Diamond Jubilee fete of Nadaswaram School of SV college of Music and Damce of TTD in Tirupati on Thursday evening, the HDPP Chief said, each Raga in Sangeet(music) cures the diseases including Chronic, he added.
Principal Smt Jamunarani, Nadaswaram College Lecturer Sri Sudhakar, DEO Sri Ramanaprasad and others participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
నాదోపాసన శ్రీవారికి ప్రీతికరం : హెచ్ డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్_ఘనంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల 60వ వార్షికోత్సవం
తిరుపతి, 2020 మార్చి 05 ;నాదోపాసన శ్రీవారికి ప్రీతికరమైందని, సంగీత కళతో నిరంతరం భగవంతుని ధ్యానిస్తున్న కళాకారులు ఎంతో అదృష్టవంతులని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ కొనియాడారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల 60వ వార్షికోత్సవం గురువారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య రాజగోపాలన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంగీతంతో ముడిపడి ఉందని, భారతం అనగా భావం, రాగం, తాళమని వివరించారు. రుగ్వేదంతో సృష్టి ప్రారంభమైందని, రుగ్ అనగా కీర్తించడమని తెలిపారు. సంగీతంలోని ఒక్కో రాగం ఒక్కో వ్యాధిని దూరం చేస్తుందని భరత మహాముని నాట్యశాస్త్రంలో తెలియజేసినట్టు తెలిపారు. ధర్మప్రచార కార్యక్రమంలో సంగీత కళాశాల కళాకారుల సేవలను వినియోగించుకుంటామన్నారు.
అనంతరం సీనియర్ పాత్రికేయులు శ్రీ రామచంద్రారెడ్డి ప్రసంగించారు. సంగీత కళాకారుల భాష చక్కగా ఉంటుందన్నారు. కళాశాల అధ్యాపకులు శ్రీ సుధాకర్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ముందుగా మధ్యాహ్నం 3 గంటల నుండి సంగీత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 10 గంటల వరకు వివిధ సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ డా.ఆర్.రమణప్రసాద్, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్.జమునారాణి, కళాశాల అధ్యాపకులు శ్రీ సింహాచలశాస్త్రి, శ్రీ సుధాకర్, డా. వందన, శ్రీ వేంకటేశ్వర్లు, కళాశాల కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీ సురేష్, విశ్రాంత ఏఇఓ శ్రీ రంగమణి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.