BHADRADRI RAMUDU RIDES ON HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై భద్రాద్రి రాముని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

Tiruchanoor, 26 Nov. 19: Goddess Padmavathi Devi in the guise of Bhadradri Ramudu took out celestial ride on Hanumantha Vahanam. 

On the fourth day evening, the devotees witnessed the goddess on the divine Hanumantha in Ramavatara. 

Holding bow and arrows in her one hand and another hand in blessing pose, Goddess in all Her divine splendour granted boons to devotees who converged on Tuesday evening to witness the grand procession. 

The Hanumantha Vahana implies Saranagati Prapatti-the total surrender before Master. It is Hanuman who has been revered as Lord on par with His Master. This shows that Lord never leaves his devotee if the later offers dedicated and selfless services to Him. The lord infact offers His beloved Bhakta a pride place on par with Him. 

HH Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri Anil Kumar Singhal, Addl CVSO Sri Sivakumar Reddy, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy, VGO Sri Prabhakar, Agama Advisor Sri Srinivasa Charyulu, Arjitham Inspector Sri Srinivasulu and others took part.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనంపై భద్రాద్రి రాముని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

తిరుపతి, 2019 న‌వంబ‌రు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి భద్రాద్రి రాముని అలంకారంలో అమ్మవారు కోదండాన్ని ధరించి భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

వాహనసేవలో కళాకారుల భరతనాట్యం, ఇతర భక్తి సంకీర్తనలకు నృత్య ప్రదర్శన, చిన్నపిల్లల దేవతామూర్తుల వేషధారణ, కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్లు శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, శ్రీ ఈశ్వరయ్య, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కోలా శ్రీ‌నివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.