BHAGAVAT GITA COMPETITION ON DECEMBER 5 _ డిసెంబ‌రు 5న తెలుగు రాష్ట్రాల్లో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు – డిసెంబరు 29న తిరుపతిలో రాష్ట్ర స్థాయి పోటీలు

TIRUPATI, 09 NOVEMBER 2021: With an aim to inculcate the great values of our Sanatana Hindu Dharma among youth, TTD will be conducting a Srimad Bhagavat Gita recitation competition to students on December 5.

This competition will be held under the aegis of the HDPP wing of TTD. The students have to recite the shlokas from the 17th Chapter, Shradhatraya Vibhaga Yogam. The Junior category includes 6th and 7th class students while students of 8th and 9th standards fall under the Senior category.

Apart from Telugu states, for the students of Tamilnadu, Karnataka, Kerala also these competitions will be conducted in the district HQs of the respective states.

The district-level winners will be presented with prizes on December 14 on the occasion of Gita Jayanthi. For those who stood first in the District level, state-level competitions will be held on December 29 at Mahati Auditorium in Tirupati. Winners of first, second and third places will be presented prizes on December 30.

Similarly, competitions will also be held in all the 700 shlokas from 18 Chapters of Bhagavat Gita and those below 18 years of age are considered to be juniors and above as seniors.

Interested persons shall register their names in the TTD Kalyana Mandapams located in district HQs.

For more details, contact ph. 9618640444.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబ‌రు 5న తెలుగు రాష్ట్రాల్లో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు
– డిసెంబరు 29న తిరుపతిలో రాష్ట్ర స్థాయి పోటీలు

తిరుమల, 2021 న‌వంబరు 09: యువతలో ఆధ్యాత్మికచింతన పెంపొందించడంలో భాగంగా టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో డిసెంబరు 5వ తేదీన భ‌గ‌వ‌ద్గీత 17వ అధ్యాయం(శ్ర‌ద్ధాత్ర‌య విభాగ యోగం)లో 6, 7వ త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థుల‌కు జూనియ‌ర్ విభాగంగాను, 8, 9వ త‌ర‌గ‌తుల విద్యార్థినీ విద్యార్థుల‌కు సీనియ‌ర్ విభాగంగాను తెలుగు రాష్ట్రాల్లోని ఆయా జిల్లా కేంద్రాల‌తోపాటు కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, చెన్నై ప్రాంతాల్లో జిల్లాస్థాయి కంఠ‌స్థ‌ పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ పోటీల్లో గెలుపొందిన వారికి గీతాజయంతి సందర్భంగా డిసెంబ‌రు 14వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు. జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలకు డిసెంబరు 29న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి 30వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు.

అలాగే భ‌గ‌వ‌ద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలు కంఠ‌స్థం వ‌చ్చిన 18 సంవ‌త్స‌రాల లోపు వారికి జూనియ‌ర్స్‌గాను, అంత‌కుపైబ‌డిన వారికి సీనియ‌ర్స్ విభాగంగాను పోటీలు నిర్వ‌హిస్తారు. ఆస‌క్తిగ‌ల‌వారు న‌వంబరు నెలాఖ‌రులోగా జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో పేర్లు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు 9618640444 నంబ‌రుకు సంప్ర‌దించాల్సి ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.