BHARATANATYAM ALLURES _ కపిలతీర్థంలో ఆకట్టుకున్న ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థినుల భరతనాట్యం

TIRUPATI, 16 FEBRUARY 2023: The performance of Bharatanatyam by the students of SV College of Music and Dance allured the devotees on Thursday.

Various devotional cultural programmes were organised on the occasion of ongoing annual brahotsavams in Kapileswara Swamy temple in Tirupati.

The devotees were mused by the dance, vocal, veena, Harikatha and other programmes.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కపిలతీర్థంలో ఆకట్టుకున్న ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థినుల భరతనాట్యం

తిరుపతి, 2023 ఫిబ్రవరి 16: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద గురువారం నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ముందుగా హరికథ పారాయణం జరిగింది. అనంతరం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఎస్.మునిరత్నం బృందం నాదస్వరం, శ్రీ ఇ.నాగరాజు బృందం డోలు వాయిద్యాలతో మంగళధ్వని వినిపించారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకులు శ్రీ రవి సుబ్రహ్మణ్యం నృత్య పర్యవేక్షణలో విద్యార్థినులు చక్కగా భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఇందులో మహాగణపతి, శివ పంచాక్షరి, తంబూరి మీటెదవ, దేవి స్తుతి, శివాష్టకం, తందనాన, అయిగిరి నందిని తదితర కీర్తనలకు చక్కగా నృత్యం చేశారు.

అంతకుముందు మృదంగంపై శ్రీ సుధాకర్, వీణపై శ్రీమతి శ్రీవాణి, ఘటంపై శ్రీ శంకర్, కీబోర్డ్ పై జాయ్, తబలాపై శ్రీ నటరాజ ప్రదర్శించిన వాయిద్య విన్యాసం భక్తులను ఆకట్టుకుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.