GAJA VAHANA SEVA HELD _ గ‌జ వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి

TIRUPATI, 16 FEBRUARY 2023: As part of ongoing annual brahmotsavams in Sri Kapileswara Swamy temple Gaja Vahana Seva was observed on Thursday evening.

Sri Somaskanda Murty amidst paraphernalia took out a celestial ride on the mighty elephant carrier to bless the devotees all along the mada streets.

Deputy EO Sri Devendra Babu, AEO Sri Parthasaradhi and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌జ వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి

తిరుపతి, 16 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి గజ వాహనంపై  అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.

ఆద్యంతరహితుడైన శివదేవుడు, ఐశ్వర్యసూచికమైన గజవాహనాన్ని అధిష్టించిన దర్శనం చేసుకోవడం భ‌క్తుల పుణ్యం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.