VELLAI SATTUPADI UTSAVAM HELD_ ఘనంగా భాష్యకారుల ‘వెళ్లై సాత్తుపడి ‘ఉత్సవం

Tirumala, 17 April 2017: On the sixth day of the otngoing 19-day religious fete of Sri Vaishnava Saint Sri Ramanujacharya, on Tuesday, Vellai Sattupadi Utsavam was held.

According to this fete, Sri Bhashyakarulavaru was dressed in white silk pattu clothes brought from Sri Rangam. As per the legend, on the request of one of his disciples Sri Kurattalwar, Sri Ramanujacharya had spent spiritual life for 14 years in Melkote of Karnataka. To mark this occasion he was dressed in white clothes instead of his usual saffron clothes.

So the same was replicated on Tuesday and Sri Ramanujacharya was taken on a procession in Tiruchi along four mada streets in Tirumala.

Jiyar Swamy, Tirumala JEO Sri KS Sreenivasa Raju and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా భాష్యకారుల ‘వెళ్లై సాత్తుపడి ‘ఉత్సవం

ఏప్రిల్‌ 17, తిరుమల, 2018: ఘనంగా భాష్యకారుల ‘వెళ్లై సాత్తుపడి ‘ఉత్సవంతిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా మంగళవారం వెళ్లై సాత్తుపడి(ధవళ వస్త్రం) ఉత్సవం ఘనంగా జరిగింది. ఏప్రిల్‌ 12న భాష్యకార్ల ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో 6వ రోజు, చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి. 6వ రోజు జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ అని వ్యవహరిస్తారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 21న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం భగవద్‌ రామానుజాచార్యులవారిని తెల్లని వస్త్రాలతో విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహించారు. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సాధారణంగా భాష్యకారుల సన్నిధిలో భగవద్‌ రామానుజాచార్యులకు కాషాయ వస్త్రం అలంకరిస్తారు. తెల్లని వస్త్రం అలంకరించడానికి ప్రత్యేక కారణం ఉంది. శ్రీవైష్ణవాచార్యులైన శ్రీరామానుజులవారు ఈ రోజున శ్రీరంగం నుంచి తెల్లని వస్త్రాలు ధరించి కర్ణాటకలోని మేల్కొటెకి వెళ్లారు. ఇందుకు శ్రీరామానుజులవారి అనుయాయులైన శ్రీ కూరత్తాళ్వార్‌ సహకారం అందించారు. ఆ తరువాత మేల్కొటెలో 14 సంవత్సరాల పాటు శ్రీ రామానుజులు ఆధ్యాత్మిక జీవనం గడిపారు. ఈ ఘట్టానికి గుర్తుగా భాష్యకార్ల ఉత్సవంలో 6వ రోజు తెల్లని వస్త్రాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. అన్ని వైష్ణవాలయాల్లో శ్రీరామానుజులవారికి ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.