KEELAPATLA BRAHMOTSVAMS FROM APRIL 23 TO MAY 1_ ఏప్రిల్‌ 23 నుండి మే 1వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 17 April 2017: The annual brahmotsavams of Sri Konetiraya Swamy of Keelapatla will be observed from April 23 to May 1 in a big way by TTD.

The JEO Sri P Bhaskar released posters related to the brahmotsavams in his chambers in TTD administrative building in Tirupati on Monday and said, the important days includes Dhwajarohanam on April 23, Kalyanotsavam and Garuda Vahanam on April 27, Chakrasnanam and Dhwajavarohanam on May 1.

DyEO Sri Venkataiah was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 23 నుండి మే 1వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

గోడపత్రికలు ఆవిష్కరించిన జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఏప్రిల్‌ 17, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్‌ 23 నుండి మే 1వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 22న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

తేదీ ఉదయం సాయంత్రం

23-04-2018(సోమ) ధ్వజారోహణం(మిథునలగ్నం) శేష వాహనం

24-04-2018(మంగళ) తిరుచ్చిఉత్సవం హంస వాహనం

25-04-2018(బుధ) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
26-04-2018(గురు) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

27-04-2018(శుక్ర) పల్లకీ ఉత్సవం కల్యాణోత్సవం, గరుడ వాహనం

28-04-2018(శని) హనుమంత వాహనం వసంతోత్సవం, గజ వాహనం

29-04-2018(ఆది) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

30-04-2018(సోమ) రథోత్సవం అశ్వవాహనం

01-05-2018(మంగళ) చక్రస్నానం ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.