GODA KALYNAM ON JAN 15 _ జనవరి 15న టిటిడి పరిపాలనా భవనంలో గోదా కల్యాణం

TIRUPATI, 14 JANUARY 2023: TTD is all set to observe Goda Kalyanam in the Parade Grounds of the TTD Administrative Building in Tirupati on January 14.

The religious event will be live telecasted on SVBC between 6:45pm and 8:45pm for the sake of global devotees.

The celestial kalyanam will be performed to Sri Krishna Swamy and Andal Sri Godai. The students of TTD run SV College of Music and Dance will perform dance ballet on the occasion.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

జనవరి 15న టిటిడి పరిపాలనా భవనంలో గోదా కల్యాణం

తిరుపతి, 2023 జనవరి 14: ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గోదా కల్యాణం జరగనుంది. సాయంత్రం 6.45 నుంచి రాత్రి 8.45 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు వేడుకగా కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో గోదా కల్యాణం నృత్యరూపకం ప్రదర్శిస్తారు. చివరగా గోవిందనామ సంకీర్తనతో కార్యక్రమం ముగుస్తుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.