BHOOMI PUJA FOR MUMBAI TEMPLE ON JUNE 7 _ జూన్ 07 ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
జూన్ 07న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
తిరుపతి, 2023 జూన్ 06: నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం జూన్ 7వ తేదీ ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ జరుగనుంది.
బుధవారం ఉదయం 6-30 గంటల నుండి 7-30 గంటల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బా రెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహంచనున్నారు.
ముంబై లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో దాదాపు రూ 100 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించడానికి రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భూమి పూజ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొననున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది
TIRUPATI, 06 JUNE 2023: All set for Bhoomi Puja of Sri Venkateswara temple coming up at Navi Mumbai on Wednesday.
The religious event will take place between 6.30am and 7.30am which will be graced by the Honourable CM of Maharastra Sri Eknath Shinde, Deputy CM Sri Devendra Fadnavis, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy also.
The Government of Maharastra has allotted 10 acres of land towards the construction of Sri Venkateswara temple and Raymonds Groups CMD Sri Gautam Singhania has come forward to contribute towards the construction of the temple. He will also attend the Bhoomi Puja ceremony.