BHOOTANADHA RIDES BHOOTA VAHANAM_ భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి
Tirupati, 27 February 2019: On the third day morning on Wednesday, Sri Kapileswara Swamy accompanied by Sri Kamakshi Devi took out celestial ride Bhoota Vahanam.
Lord Shiva is often worshipped as the God of souls, spirits, and ghosts. He is considered to be the source of mystical energy and the destroyer. To imply that He is the Bhutanatha who decides the life and death cycle, Lord takes ride on Bhuta Vahana.
Temple DyEO Sri Subramanyam, VGO Sri Ashok Kumar Goud, AEO Sri Nagaraj, Suptd Sri Rajkumar, Archakas and devotees took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి
ఫిబ్రవరి 27, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవల ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చాడు.
అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.