LORD SOMASKANDA MURTHY RIDES BHUTA VAHANAM_ భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

Tirupati, 8 February 2018: On Day 3 of Annual Brahmotsvams of Sri Kapileswara Swamy Temple, Lord took ride on Bhuta Vahanam in Somaskanda murthy avatar along with consort Sri Kamakshi and blessed devotees.

The Vahanam went around Kapilatheertha road, Anna Rao circle, Vinayaka Nagar L type quarters, Hare Rama Hare Krishna temple, NGO colony, Alipiri bypass blessing devotees who worshipped with camphor harati, chakka bhajans, and Kerala drums all along.

Puranas say that Brahma had asked Prama Shiva to punish the Bhuthas which harassed common people who camped at Grave yards, the abode of Bhuthas to complete his mission. Hence his parade on Bhutha vahanam to showcase his victory of Bhuthas.

Later in the day the processional dieties- Somaskandamurthi and Sri Kamakshi Devi were given Snapana Thirumanjanam with milk, curd, honey, fruit juices and sandal paste.

SIMHA VAHANAM

Tonight Lord will ride Simha Vahanam in the avatar of Paramashiv and Mrugaraju.

Cultural programs: During the vahana sevas the Kolata, Venkanna godugu and chakka bhajan programs were rendered by teams led by Smt B Manimegala, Smt S Dhanalakshmik Sri K Murali, K Pacchappa and Smt T Anasuyamma.

TTD local temles DyEO Sri Subramanyam, AEO Sri Sankara Raju, Chief Priest Sri Manuswami, AVSO Sri Gangaraju, Supdt Sri Rajkumar, Temple inspectors Sri Narayana and Sri C Murali krishna particiated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

ఫిబ్రవరి 08, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవల ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చాడు.

అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

సింహ వాహనం :

గురువారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్ర మృగాల భయం ఉండదు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవల్లో తిరుపతికి చెందిన శ్రీమతి బి.మణిమేగల బృందం, శ్రీమతి ఎస్‌.ధనలక్ష్మీ బృందం, శ్రీ కె.మురళీ బృందం కోలాట భజన, వెంకన్న గొడుగు, తిరుపతికి చెందిన శ్రీ కె.పచ్చప్ప బృందం, శ్రీమతి టి.అనసూయమ్మ బృందం చెక్క భజన ప్రదర్శనలిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్‌వో శ్రీగంగరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీక ష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.